/rtv/media/media_files/2025/03/01/yK0txSGOFTkFhu2s2GjS.jpg)
Nidhi Agarwal
Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్- నిధి అగర్వాల్ జంటగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం జులై 24న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా హీరోయిన్ నిధి ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో కొంతమంది సినిమా విశేషాల గురించి అడిగి తెలుసుకోగా. మరొకొందరు నిధిని వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ అభిమాని నిధి మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాడు. ఏకంగా పెళ్లి చేసుకుంటాను మీ అమ్మ నెంబర్ పంపు అంటూ నిధిని అడగడం నెట్టింట వైరల్ గా మారింది. ‘‘మీ అమ్మ ఫోన్ నెంబరు ఇస్తే.. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను! ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి’’ అంటూ హార్ట్ ఎమోజీతో విజ్ఞప్తి చేశాడు. దానికి నిధి 'అవునా? చిలిపి..’ అంటూ సమాధానమిచ్చింది.