Earthquake: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

భారత్‌లో వరుస భూకంపాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. అస్సాం, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లో భూంకపాలు రావడం కలకలం రేపింది.

New Update

ఇటీవల జపాన్‌లో వరుస భూకంపాలు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్‌లో కూడా వరుస భూకంపాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. అస్సాంలో 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

అలాగే ఉత్తరాఖండ్‌లో 3.2 తీవ్రతతో, బెంగాల్‌లో 2.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అలాగే అండమాన్ నికోబార్‌లో కూడా వరుసగా భూకంపాలు సంభవించాయి. మొత్తంగా మూడు రోజుల్లో 9సార్లు భూప్రకంపనలు వచ్చాయి. మరోవైపు బాబా వంగా యుగాంతం వస్తుందని గతంలో చెప్పిందని.. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని కొందరు నమ్ముతున్నారు. మరికొందరు ఇదంతా బూటకమేనని.. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ఆయా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెబుతున్నారు.  

Also Read: మహారాష్ట్రలో ముదురుతున్న భాషా వివాదం.. హిందీ VS మరాఠీ

Advertisment
Advertisment
తాజా కథనాలు