AP Crime: విశాఖలో దారుణ హత్య.. చికిత్స పొందుతూ లోహిత్ మృతి

విశాఖ మాధవదారలో దారుణ హత్య జరిగింది. ఎయిర్‌పోర్టు పీఎస్ పరిధిలో లోహిత్ అనే యుకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగానే లోహిత్‌ను హత్య చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోహిత్ మృతి చెందాడు.

New Update

AP Crime: విశాఖపట్నంలో మరోసారి హత్యా ఘటన కలకలం రేపింది. మాధవదార ప్రాంతం ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ చోటుచేసుకుంది. సంఘటనలో లోహిత్ అనే యువకుడు దుండగుల బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. లోహిత్‌ను చంపేందుకు ముందుగానే కుట్రపన్ని పక్క ప్రణాళికతో  హత్య చేసినట్లు సమాచారం. ఈ దారుణం బుధవారం జనసమ్మోహిత ప్రాంతంలో జరిగింది.

పాత కక్షలే హత్యకు కారణం..

చుట్టు పక్కన జనం ఉన్నా నిందితులు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అందరి ముందు లోహిత్‌ను నిలిపివేసి నాలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడితో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. లోహిత్‌ ప్రాణాలను కాపాడే ప్రయత్నంగా కొందరు స్థానికులు అతడిని తక్షణమే సమీప  ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న అతడు చికిత్స పొందుతూ మరణించాడు. హత్య అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు ప్రారంభించారు. 

ఇది కూడా చదవండి: పిల్లలపై వేడి పాలు లేదా టీ పడ్డాయా.. అయితే ఈ ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి

నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ.. హత్య వెనక ఉన్న అసలు కారణాలను కూడా తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రజల సమక్షంలో జరిగిన ఈ దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాత కక్షలే ఈ రక్తపాతం కారణమై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మాధవదార ప్రాంతం ఇప్పటికే గతంలోనూ చిన్నచిన్న సంఘటనలు జరిగినాయి. తాజాగా చోటుచేసుకున్న ఈ హత్యతో ఆ ప్రాంత వాసుల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. లోహిత్ మృతితో అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: డబుల్ ఇంజిన్‌ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు

( AP Crime | ap crime latest updates | ap crime updates | ap-crime-news | Latest News | telugu-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు