/rtv/media/media_files/2025/07/09/shinde-mla-2025-07-09-09-59-40.jpg)
ముంబైలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌లో క్యాంటీన్ సిబ్బందిపై శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే దాడికి దిగారు. బుల్ధానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ గైక్వాడ్, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ క్యాంటీన్‌లో వడ్డించే ఫుడ్ పై అసంతృప్తిగా ఉన్నారు. తనకు వడ్డించిన పప్పు వాసన వస్తుందనే కారణంతో ఎమ్మెల్యే క్యాంటీన్ ఉద్యోగులలో ఒకరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.
Also read : Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఎల్ అండ్ టీ సంచలన నిర్ణయం!
జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ
క్యాంటీన్ సిబ్బందికి, శివసేన ఎమ్మెల్యేకు మధ్య ఘర్షణ పెరిగి హింసకు దారితీసింది. చాలా మంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే ఏమీ పట్టించుకోకుండి సిబ్బందిపై దాడిని కొనసాగించాడు. క్యాంటీన్ నిర్వాహకుడిపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే బెదిరింపులకు కూడా దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Caught on Camera: Shinde Sena MLA Sanjay Gaikwad Punches, Slaps Canteen Worker Over 'Stinking Dal' at Mumbai MLA Guest House - Video Viral
— Republic (@republic) July 9, 2025
Tune in to LIVE TV for all the fastest #BREAKING alerts - https://t.co/CF3012S8xQpic.twitter.com/YSARKvUAzE
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ ఘటన జరగడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన పట్ల వివిధ పార్టీల నాయకులు స్పందిస్తూ ఎమ్మెల్యే తీరును ఖండించారు. కాగా మరాఠీ మాట్లాడటానికి నిరాకరించినందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కార్యకర్తలు మీరా రోడ్ దుకాణదారుడిపై దాడి చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరిగడంపెద్ద రాజకీయ సంఘర్షణకు దారితీసింది. తన చర్యపై ఎమ్మెల్యే ఏమాత్రం విచారం వ్యక్తం చేయలేదు. ఇది శివసేన స్టైల్ అంటూ బదులివ్వడం గమనార్హం.
Also Read : AP Crime: విశాఖలో దారుణ హత్య.. చికిత్స పొందుతూ లోహిత్ మృతి