Allu Arjun-Atlee: అల్లు అర్జున్- అట్లీ సినిమాపై రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్, ఆస్కార్ విజేత విల్ స్మిత్ విలన్‌గా నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
విలన్ గా ఆస్కార్ విజేత
సినిమాలో ప్రధాన విలన్ పాత్ర కోసం మేకర్స్ విల్ స్మిత్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, విల్ స్మిత్ ఒక ఇండియన్ సినిమాలో కీలక పాత్రలో నటించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇది భారతీయ సినిమాల ప్రపంచవ్యాప్త స్థాయిని మరింత పెంచుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. బాహుబలి, కేజీఎఫ్, RRR, పుష్ప వంటి సినిమాలు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేశారు. దీంతో హాలీవుడ్ టాప్ నటీనటులు కూడా మన సినిమాల్లో భాగమవుతున్నారు.
రూ. 800 కోట్ల బడ్జెట్
పునర్జన్మ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ సినిమా కథ రూపొందనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 800 కోట్ల ఖర్చుతో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే దీనికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ (VFX) పనుల కోసం హాలీవుడ్ స్టూడియోలత టైఅప్ అయ్యారట మేకర్స్. 'అవెంజర్స్', 'స్పైడర్ మ్యాన్', 'వండర్ ఉమెన్' వంటి పెద్ద సినిమాలకు పని చేసిన స్టూడియోలు ఈ ప్రాజెక్ట్‌కు పనిచేయబోతున్నాయని టాక్. వీటితో పాటు అల్లు అర్జున్ ఈ సినిమాలో డబుల్ రోల్లో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విల్ స్మిత్ లాంటి హాలీవుడ్ స్టార్‌తో.. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్స్‌లో తలపడటం ఒక హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే 'కింగ్ రిచర్డ్' సినిమాలో నటనకు గానూ విల్ స్మిత్ కి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు వరించింది. ఇది అతని మొదటి ఆస్కార్ అవార్డు, దీనిని అతను 2022 అకాడమీ అవార్డుల వేడుకలో అందుకున్నాడు.
Also Read: Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. ఆ ఆలయంలో శ్యామలా దేవి ప్రత్యేక పూజలు!