/rtv/media/media_files/2025/07/09/nimisha-priya-2025-07-09-09-08-29.jpg)
కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ ఉరిశిక్షను ఖరారు చేసింది. ఆదేశ అధ్యక్షుడి ఆమోదంతో ఈ నెల 16న ఈ శిక్షను యెమెన్ దేశం అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ,మానవ హక్కుల కార్యకర్త శామ్యూల్ జెరోమ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబం సభ్యులకు కూడా వెల్లడించారు.
గతంలో నిమిష ఉరిశిక్షపై క్షమాభిక్షను భారత విదేశాంగ శాఖ కోరగా అందుకు ఆదేశ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి తిరస్కించారు. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష ఖరారైంది. ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా జైలులో ఉన్నారామే. 2017లో వ్యాపార భాగస్వామిని నిమిష హత్య చేయగా.. 2020లో మరణ శిక్ష విధించింది యెమెన్ కోర్టు. నిమిష ప్రియది కేరళలోని పాలక్కాడ్ జిల్లా కొల్లెంగోడ్. 2008లో యెమెన్‌కు వెళ్లింది. యెమెన్ హాస్పిటల్స్‌లో నర్సుగా పని చేసింది. తర్వాత చిన్న క్లినిక్ ప్రారంభించింది. యెమెన్‌లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామి కంపల్సరీగా ఉండాలి.
ఇద్దరి మధ్య విభేదాలు
2014లో తలాల్ అబ్డో మహదీతో పరిచయం ఏర్పడగా.. తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో నిమిషను బెదిరించి మహదీ ఆమె పాస్‌పోర్టు లాగేసుకున్నారు. పాస్‌పోర్టు తీసుకునేందుకు మహదీకి మత్తు మందు ఇచ్చింది నిమిష. అయితే మత్తముందు ఓవర్ డోస్ కావడంతో మహదీ చనిపోయింది. మహదీ మృతి తర్వాత ఇండియాకు వచ్చేందుకు నిమిష ప్రయత్నించగా.. 2018లో మహదీ హత్య కేసులో నిమిషను దోషిగా కోర్టు నిర్ధారించింది. గత ఏడాది డిసెంబర్ 30న, యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి 2017 నుండి జైలులో ఉన్న నిమిషా ప్రియకు మరణశిక్షను ఆమోదించారు. కాగా బాధితురాలి కుటుంబానికి పరిహారంగా చర్చల బృందం ఒక మిలియన్ USD అందించనున్నట్లు సమాచారం.
Also read : AP Crime: విశాఖలో దారుణ హత్య.. చికిత్స పొందుతూ లోహిత్ మృతి