KTR Tweet - Gujarat Bridge Collapse: డబుల్ ఇంజిన్‌ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు

గుజరాత్‌లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి అకస్మాత్తుగా కూలింది. ఈ ప్రమాదంలో నదిలో వాహనాలు పడి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. బ్రిడ్జి కూలడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించి పలు విమర్శలు చేశారు.

New Update
Gujarat Crime News

KTR Tweet - Gujarat Bridge Collapse

KTR Tweet - Gujarat Bridge Collapse:గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనపై ఎక్స్‌ వేదికగా కేటీఆర్ స్పందించారు. డబుల్ ఇంజిన్‌ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు. మోర్బీ వంతెన(Morbi Bridge) కూలి 140 మందికి పైగా మరణించిన తర్వాత ఇది మరో షాక్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న గుజరాత్, బిహార్‌లో తరచూ వంతెనలు కూలుతున్నాయని కేటీఆర్ విమర్శలు చేశారు.

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోవడంతో..

గుజరాత్‌లో మహిసాగర్ నదిపై నిర్మించబడిన గంభీర బ్రిడ్జి(Gambhira Bridge) కూలికూలింది. వడోదర, ఆనంద్ జిల్లాలను కలుపుతూ ఉన్న ఈ వంతెనపై అనేక మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో వాహనాలు నేరుగా నదిలోకి పడిపోయాయి. ఆ వాహనాల్లో ఉన్న పలువురు ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరికొంతమంది కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలోకి పడిపోయిన వాహనాలను వెలికితీయడానికి క్రేన్లు, బోట్ల సాయంతో చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

 వడోదర, ఆనంద్, భారూచ్, అంకాళేశ్వర్ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో గుజరాత్‌లో వరుసగా వంతెనలు కూలిపోతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభంలోనే వంతెన కూలిపోయిందన్న విషయం అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన కూలిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.

Also Read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

ఇది  కూడా చదవండి: భారీ వరదలు.. అతలాకుతలంగా మారిన అమెరికాలోని టెక్సాస్



Advertisment
Advertisment
తాజా కథనాలు