Drug Racket: హైదరాబాద్ పబ్ లలో మరోసారి డ్రగ్స్ కలకలం...,చెప్పుల్లో దాచి సరఫరా...

హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్‌లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఈగల్ టీం బయటపెట్టింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు టీం గుర్తించింది. రెస్టారెంట్ ఓనర్ సూర్య నేతృత్వంలో డ్రగ్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు.

New Update
 drugs

drugs

Drug Racket :  తెలంగాణలో డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని ప్రభుత్వ చెబుతున్నప్పటికీ డ్రగ్స్‌ దందా యథావిథిగా కొనసాగుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్‌ ను అరికట్టడం కోసం ప్రభుత్వం ఈగల్‌ టీం ను ఏర్పాటు చేసింది. తాజాగా ఈగల్ టీం నగరంలోని ఓ రెస్టారెంట్‌లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాను బయటపెట్టింది. ఈగల్ టీం అధికారులు ఇవాళ (బుధవారం) ఆకస్మిక తనిఖీలు చేశారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు టీం గుర్తించింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య నేతృత్వంలో డ్రగ్ సరఫరా జరుగుతున్నట్లు ఈగల్ టీం అధికారులు తెలిపారు.రెస్టారెంట్ యజమాని సూర్య నగరంలోని ప్రముఖ పబ్‌లతో కలిసి పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించింది.

Also read: డబుల్ ఇంజిన్‌ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు

Drugs In Hyderabad Pubs

డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్న సూర్యతో పాటు అతని స్నేహితుల ద్వారా  ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తేలింది. భీమవరానికి చెందిన డాక్టర్‌ ప్రసన్న ఇప్పటి వరకు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండా నగరంలోని 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. కేవలం వ్యక్తులకే కాకుండా నగరంలోని ప్రిజమ్ పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్రాడ్ వే పబ్, వాక్ కోరా పబ్ లకు సైతం డ్రగ్స్ సప్లై చేసినట్టు గుర్తించారు. సూర్య స్నేహితుడు హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. సూర్య, హర్షలను ఈగల్ టీం అరెస్ట్ చేసి కేసుపై మరింత లోతుగా విచారణ జరుపుతోంది.

Also Read: పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్

కాగా నగరంలోని ప్రముఖ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యజమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు కనుక్కున్నారు. వాటియజమానులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. క్వాక్ రాజాశేఖర, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్ వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ మగ్గురు సూర్యతో కలిసి డ్రగ్స్‌ పార్టీలు నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు.

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

ఇక సూర్య ములుగులోని రిసార్ట్‌ను బుక్‌ చేసుకుని అక్కడికి తన స్నేహితులను పిలిపించుకుని వారికి పార్టీలు ఇచ్చినట్లు తేల్చారు. కొంపల్లిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఈగల్ టీం అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఢిల్లీ కి చెందిన ఒక నైజీరియన్‌ మహిళ చెప్పుల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. లేడీస్ హై హీల్స్ చెప్పుల లోపల డ్రగ్స్ పెట్టి మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యకు పార్సిల్ చేశారు. ఢిల్లీకి చెందిన నిక్కి, జెర్రీ నైజీరియన్‌లు కలిసి సూర్యకు డ్రగ్స్ పంపించినట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ పబ్‌లతో పాటు మరిన్ని పబ్‌లపై దాడులు చేసేందుకుఈగల్‌ టీం సమాయత్తమవుతోంది. డ్రగ్స్‌ దందాలో చిక్కుకున్న పబ్‌లను అధికారులు మూసివేయకుండా రాజకీయ పలుకుబడితో తిరిగి నిర్వహంచడం వల్ల దందా యధేచ్ఛగా కొనసాగుతోందన్న విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి.

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

hyderabad-drugs-case | drugs-free-telangana | drugs-case-telugu | drugs-in-hyderabad | drugs-in-jubilee-hills | drugs-party | drugs

Advertisment
Advertisment
తాజా కథనాలు