/rtv/media/media_files/2025/07/05/texas-floods-2025-07-05-10-23-03.jpg)
Texas floods
Texas Floods:అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రకృతి పరిస్థితులు తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల అక్కడ చోటుచేసుకున్న భారీ వర్షాలు(Heavy Rains), వరదల ఉధృతి(Floods) ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. సాధారణంగా పొడిగా ఉండే టెక్సాస్ ప్రాంతం ఈసారి భారీ వర్షాల కారణంగా జలమయమైంది. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ వరదల తాకిడికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే కావడం విషాదకరం. ఇంకా 160 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Also Read:భారీ వరదలు.. అతలాకుతలంగా మారిన అమెరికాలోని టెక్సాస్
వర్షాల ఉధృతి పెరిగి..
టెక్సాస్‌లోని కెర్ కౌంటీలోనే సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాడలూప్ నది తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అత్యధికంగా ప్రభావితమయ్యారు. ఈ ప్రాంతంలో వర్షాల ఉధృతి పెరిగి నది పొంగిపొర్లడంతో పక్కనే ఉన్న కాటేజీలు, వాహనాలు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి. ట్రావిస్, బర్నెట్, టామ్‌గ్రీన్, విలియమ్సన్ వంటి ఇతర కౌంటీలూ భారీ వర్షాల ధాటికి నష్టపోయాయి. మౌంట్ బోనెల్, లేక్ ట్రావిస్ ప్రాంతాల్లో గాలిలో తేలుతూ ప్రయాణించే పడవలు కూడా నీటిలో మునిగిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నా.. కురుస్తున్న వాన మరో ముప్పుగా మారుతోంది.
Also Read: ఐదు రకాల ఎండు ద్రాక్షలు.. ఏ రకం తింటే ఎలాంటి ప్రయోజనం తెలుసుకోండి
ఈ ప్రమాదంలో ముందస్తు హెచ్చరికల లేకపోవడం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. హెచ్చరికల వ్యాప్తిలో విఫలమైన వాతావరణ శాఖపై విమర్శలు వస్తున్నాయి. వరదలు మొదలై క్షణాల్లో నీటిలో మునిగిపోయిన కార్లు, ఇండ్లు ఇప్పటికీ పూర్తిగా కనపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్తుతో టెక్సాస్ రాష్ట్రం మానవీయ విపత్తును ఎదుర్కొంటోంది. సహాయక బృందాలు నిరంతరాయంగా రంగంలో ఉన్నాయి. జాతీయ గార్డు, రెస్క్యూ బృందాలు పని చేస్తున్నా వర్షాల తీవ్రత తగ్గకపోవడం వారి చర్యలకు అడ్డు అవుతోంది. టెక్సాస్ వాసులకు ఇది మరచిపోలేని బాధగా మిగిలిపోనుంది.
Also Read: హైదరబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. మూడు ATMలలో చోరీ
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్