/rtv/media/media_files/2025/07/09/fightting-2025-07-09-07-42-21.jpg)
Congress vs BRS: ఓ టీవీ డిబెట్ లో ఇద్దరు రాజకీయ నాయకులు సహనం కోల్పోయారు. కెమెరా ఉందన్న సోయి కూడా మరిచిపోయారు. మాటమాట పెరగడంతో ఊగిపోయారు. ఒకరిపై కూడా ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో సవాళ్ల పర్వం నడుస్తోంది. అయితే దీనిపై ఓ ప్రముఖ ఛానల్ టీవీ చర్చ నిర్వహిచింది.
Also Read: Crime : అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అత్త, మేనల్లుడికి పెళ్లి .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
ఓ టీవీ చర్చలో భాగంగా మాటామాటా పెరిగి కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025
Video Credits - YOYO TV pic.twitter.com/T0XjAwdNHt
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?
చర్చ జరుగుతూ ఉండగా..
అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను కూడా డిబేట్ కు పిలిచారు. ఈ క్రమంలో చర్చ జరుగుతూ ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటమాట పెరిగింది. దీంతో ముందుగా కాంగ్రెస్ నేత దేవని సతీష్.. బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ పై చేయి లేపారు. దీంతో కోపంతో ఊగిపోయిన గౌతమ్ .. సతీష్ పైకి దాడికి దిగాడు. దీంతో ఇరువురు ఎవరీ మాట వినకుండా ఒకరిపైకి మరోకరు దాడికి పాల్పడ్దారు. కెమెరా ముందే తన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: AP Crime: కొంపముంచిన ఓవర్ స్పీడ్.. పుణ్యక్షేత్రాల కోసమని వెళ్లి అనంత లోకాలకు!