/rtv/media/media_files/2025/07/09/ycp-prasanna-2025-07-09-11-31-27.jpg)
Case on YCP Nallapareddy
Case on YCP Nallapareddy: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(EX MLA Nallapareddy Prasannakumar Reddy)పై కేసు నమోదైంది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో తన ప్రతిష్టకు భగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆయనపై కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. BNS 74, 75, 79, 296 r/w 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?
వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న, ఇతర నేతలు మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఆమె పోలీసులకు అందజేశారు. ప్రసన్నతో పాటుగా మరికొంత మందిపైనా కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం. అవినీతిలో ప్రసన్నకుమార్‌రెడ్డి పీహెచ్‌డీ చేశారంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో ఆయన కామెంట్స్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: యుగాంతం ఎఫెక్ట్.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు
ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి
ఇదే క్రమంలో సోమవారం రాత్రి నెల్లూరు(Nellore) నగరంలోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొందరు ఈ దాడిని టీడీపీ శ్రేణులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిలోని ఫర్నీచర్, కారుతో పాటు ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరని సమాచారం. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్
కోవూరు ఎమ్మెల్యే @Prashanthi_VPR గారిపై మురికి వ్యాఖ్యలతో మహిళా లోకాన్ని కించపరిచిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని మహిళ కమిషన్ ఛైర్పర్సన్ @SailajaRayapati గారికి కోరిన మహిళా సంఘాలు. pic.twitter.com/PoxuZci6k2
— MC RAJ🕊️ (@BeingMcking_) July 8, 2025
Also Read:భారీ వరదలు.. అతలాకుతలంగా మారిన అమెరికాలోని టెక్సాస్