Turkey - Bangladesh: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్‌.. పాక్‌తో ఉన్న పాత శత్రుత్వాన్ని మర్చిపోయి దానితో చేతులు కలిపింది. భారత్‌పై నిఘా పెంచేందుకు టర్కీ, బంగ్లాదేశ్, పాక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Turkey Deepening Ties With Bangladesh

Turkey Deepening Ties With Bangladesh

గతేడాది ఆగస్టుకు ముందు షేక్‌ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్‌.. భారత్‌కు విశ్వసనీయమైన పొరుగు దేశంగా ఉండేది. రిజర్వేషన్ అంశంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడి ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఫలితంగా హసీనా ప్రభుత్వం పడిపోయింది. చివరికి ఆమె దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్‌.. పాక్‌తో ఉన్న పాత శత్రుత్వాన్ని మర్చిపోయి దానితో చేతులు కలిపింది.  

దీంతో బంగ్లాదేశ్, పాక్ మధ్య సాన్నిహిత్యం భారత్‌కు తలనొప్పిగా మారింది. పాక్‌ మిత్రదేశమైన టర్కీ కూడా బంగ్లాదేశ్‌తో సంబంధాలు బలోపేతం చేసుకుంటోంది. అంతేకాదు మంగళవారం టర్కీ రక్షణశాఖ ఉన్నతాధికరి హలుక్‌ గోర్గన్ ఢాకా చేరుకున్నట్లు బంగ్లాదేశ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టర్కీ, బంగ్లాదేశ్ మధ్య సైనిక సహకారంపై ఆయనతో చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్, నారాయణగంజ్‌లో టర్కీ సాయంతో రెండు రక్షణ పారిశ్రామిక మండలాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే భారత్‌పై నిఘా ఉంచేందుకు టర్కీకి ఇది సులభతరం అవుతుంది. ఇది దాని మిత్రదేశమైన పాక్‌కు కూడా ఉపయోగపడుతోందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: మహారాష్ట్రలో ముదురుతున్న భాషా వివాదం.. హిందీ VS మరాఠీ

Also Read :  కల్తీ కల్లు తాగి.. 11 మంది స్పాట్‌లో..

Turkey Ties With Bangladesh Threat To India

షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పడు బంగ్లాదేశ్‌-టర్కీ మధ్య సంబంధాలు సరిగ్గా ఉండేవి కాదు. 2012లో అప్పటి టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా గుల్.. 1971 యుద్ధ నేరాలకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న వారిని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కానీ బంగ్లాదేశ్ దీన్ని తిరస్కరించింది. దీని ఫలితంగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కానీ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు జరగడం, యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్-టర్కీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరుదేశాలు తమ రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. 

బంగ్లాదేశ్‌లో టర్కీ ఉనికి పెరిగితే భారత్‌కు ఇది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే టర్కీ అనేది బంగ్లాదేశ్‌లో ఉన్న రాడికల్ ఇస్లామిక్ గ్రూపులకు.. ముఖ్యంగా జమాత్ ఇ-ఇస్లామీకి మద్దతుగా ఉంటోంది. ఢాకాలో జమాత్ కార్యాలయ స్థాపనకు టర్కిష్ నిఘా సంస్థలతో సంబంధం ఉన్న కొన్ని సంస్థలు బంగ్లాదేశ్‌కు డబ్బు చెల్లించాయని భారత నిఘా సంస్థలు భావిస్తున్నాయి. కొంతమంది జమాత్ నాయకులు టర్కిష్ సంస్థలు స్పాన్సర్ చేసిన టర్కిష్ ఆయుధ స్థావరాలను కూడా సందర్శించారు. అయితే తాజా టర్కీ అధికారి పర్యటన సందర్భంగా.. టర్కీ నుంచి బంగ్లాదేశ్ డ్రోన్లు, నిఘా పరికరాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలపై సంతకం చేయవచ్చని భారత భద్రతా అధికారులు చెబుతున్నారు. 

ఇదిలాఉండగా బంగ్లాదేశ్, టర్కీ కలవడం భారత్‌కు ఓ హెచ్చరిక సంకేతం లాంటిదేనని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే టర్కీ ఇస్లామిక్ దేశం. కశ్మీర్‌ సమస్య విషయంలో భారత్‌ను ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ చాలాసార్లు టార్గెట్ చేశాడు. జమ్మూకశ్మీర్‌ విషయంలో ఆయన ఎప్పుడూ కూడా పాకిస్థాన్‌కే మద్దతుగా నిలిచాడు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)లో కూడా ఆ అంశాన్ని లేవనెత్తాడు.

 ఇటీవల భారత్‌లో పహల్గాం ఘటన జరిగిన తర్వాత భారత్‌-పాక్ మధ్య పరస్పర దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టర్కీనే పాక్‌ను ఆదుకుంది. ఆ దేశానికి చెందిన డ్రోన్లనే పాకిస్థాన్‌.. భారత్‌పైకి ప్రయోగించింది. అంతేకాదు భారత్‌.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తే టర్కీ దీన్ని ఖండించింది. పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచింది. అంతేకాదు భారత్ చేసిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదులకు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా నివాళులర్పించాడు. దీంతో భారత్‌లో టర్కీ వస్తువులను బహిష్కరించాలని ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అయ్యింది. 

Also Read: శ్రీ రాముడు నేపాల్‌లో జన్మించాడు.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్, టర్కీ.. ఈ మూడు కూడా ఓ వ్యూహాత్మక కూటమిగా ఏర్పడితే.. ఇది భారత్‌పై ప్రభావం చూపుతుంది. బంగ్లాదేశ్‌ భారత్‌కు మూడు వైపులా ఉండటంతో ఈ దేశాల నిఘా వ్యవస్థ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు భారత్‌కు మిత్రదేశాలుగా ఉన్న టర్కీ, బంగ్లాదేశ్‌లు ఇప్పుడు కావు. ఈ మూడు దేశాల సాన్నిహిత్యం భారత భద్రతకు ముప్పు కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టర్కీ బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులకు మద్దతు ఇవ్వడంతో ఇవి భారత వ్యతిరేక కార్యకలాపాలను మరింత పెంచుతాయని చెబుతున్నారు. అంతేకాదు టర్కీ, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ కలిసి బంగ్లాదేశ్‌లోనే భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగించుకోవచ్చని పలు నిఘా నివేదికలు కూడా చెబుతున్నాయి. 

Also Read :  మళ్ళీ చిక్కుల్లో నయనతార.. 5 కోట్లు చెల్లించాలని లీగల్ నోటీసులు

pakistan | turkey | bangladesh | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు