CM Revanth Reddy : తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్‌ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కృష్ణా నది జలాలపై ఏపీద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది.ఈ ప్రజంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో నీటి దోపిడీ మొదలైందన్నారు.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కృష్ణా నది జలాలపై ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది. ఈ ప్రజంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే ఏపీ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ మొదలైందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కృష్ణలో నీళ్లు తెలంగాణలోకి వచ్చిన వెంటనే ఒడిసి పట్టాల్సింది. వచ్చిన చోట వదిలేసి కర్నూలు నుంచి తిరిగి వచ్చాక పట్టుకుంటాం అంటున్నారు. జూరాల నుంచే నీరు తీసుకుందామని చిన్నారెడ్డి ఆరోజు సూచన చేశారు. చిన్నారెడ్డిని కేసీఆర్‌ అవమానించారు. ఆ రోజే చిన్నారెడ్డి మాట కేసీఆర్‌ వినిఉంటే నీళ్ల దోపిడి జరిగేది కాదు. చిన్నారెడ్డి సౌమ్యుడు కాబట్టి ఏం మాట్లాడలేదు.ఈ ద్రోహానికి కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి. మేం సరిదిద్దుతుంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసి మాపై నిందలు మోపుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

KCR Has Betrayed Telangana - CM Revanth Reddy

ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల మనకు హక్కులు రాలేదన్న రేవంత్‌ రెడ్డి అవసరమైతే నాలుగు రోజులు చర్చ పెడదామని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి నుంచి 2 టీంఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంటే 1 టీఎంసీకి కేసీఆర్‌ తగ్గించారని ఆరోపించారు. అంచనా వ్యయం పెంచారు, నీటిని తగ్గించారన్నారు. పదేళ్లలో ఏడాదికి కి.మీ టన్నెల్‌తవ్వినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తయ్యేది. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, ఇందిరాసాగర్‌, ఏ ఒక్క ప్రాజెక్టుపూర్తి చేయలేదు. బేసీన్లు లేవు, బేషజాలు లేవని కేసీఆర్‌ ఎట్ల అంటాడు. చర్చ చేద్దామంటే సభకు రాడు. కేసీఆర్‌ హయాంలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్‌లో ఉన్న ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. చేవేళ్ల పేరు పెట్టి నీళ్లు ఇవ్వకపోతే నిలదీస్తారని పేరు మార్చారు. 11 ఏఐబీపీ ప్రాజెక్టులను కేసీఆర్‌ ముట్టుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Also Read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

జగన్‌, కేసీఆర్‌ మధ్య ఏముంది అనేది అసవసరం. బేసీన్లు, బేషజాలు లేవంటూ ఆంధ్రావాళ్లను నీళ్లు తీసుకు పొమ్మని కేసీఆర్‌ చెప్పారన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదన్నారు. జగన్‌ను పిలిచి సలహాలు ఇచ్చి, జీవోలు వచ్చేలా కేసీఆర్‌ సహకరించారు. కృష్ణానదిలో కేసీఆర్‌ చేసిన ద్రోహం ఉమ్మడి రాష్ర్టంలో సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యిరెట్లు ఎక్కువ, తెలంగాణ జాతిపిత అని చెప్పుకును కేసీఆర్‌ తెలంగాణకు ద్రోహం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Also Read : మామిడి రైతులకు అన్యాయం... ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే వచ్చా.. జగన్‌ కీలక వ్యాఖ్యలు

Also Read :  గుంటనక్క టర్కీపై భారత్ రివేంజ్.. ఆ దేశంపైకి మన మిస్సైళ్లు!

uttamkumar-reddy | harishrao | Ktr | kcr vs revanth reddy | ys jaganmohan reddy | krishna-water-issue | krishna-water | cm-revanthreddy

Advertisment
Advertisment
తాజా కథనాలు