/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
WIFE MURDERED HUSBAND
పలు కారణాలతో భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు రోజు ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసింది భార్య. మద్యానికి బానిసైన భర్త షేక్ మహ్మద్ నిత్యం ఇంటిలో గొడవలు పడటంతో పాటు తనను వేధిస్తున్నాడని, ఆయన వేధింపులు భరించలేక హత్య చేసినట్లు భార్య స్పష్టం చేసింది.
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?
Also Read : గుంటనక్క టర్కీపై భారత్ రివేంజ్.. ఆ దేశంపైకి మన మిస్సైళ్లు!
Wife Kills Husband In Mallardevpalli
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వట్టేపల్లిలోని సైఫీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలి పని చేసుకుని జీవించే షేక్ మహ్మద్ మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను వేధిస్తున్నాడు. వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో ఇది భరించలేని భార్య బండరాయితో కొట్టి భర్తను హత్య చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానం.. పైలట్ మృతి
Also Read : మామిడి రైతులకు అన్యాయం... ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే వచ్చా.. జగన్ కీలక వ్యాఖ్యలు
wife-killed-her-husband | wife-killed-husband | hydrabad | mylardevpally | crime news | telugu crime news