కూకట్‌పల్లి కల్తీ కల్లు బాధితులను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు పరామర్శించారు. నిమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్న మంత్రి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే బాధ్యులెంతటి వారైనా వదలమని స్పష్టం చేశారు. చికిత్స పొందుతున్న 15 మంది బాధితులను మంత్రి పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read: యుగాంతం ఎఫెక్ట్.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు
అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ... సంఘటన జరిగిన వెంటనే ఎక్సైజ్, పోలీసు అధికారులు వెంటనే స్పందించి హుటాహుటిన వారిని హాస్పిటల్స్ కు తరలించారని అన్నారు. సకాలంలో వైద్యం అందడంతో బాధితులందరూ కోలుకుంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అందరూ ఒకే రకమైనలక్షణాలతో బాధపడుతున్నారని, ప్రాథమికంగా ఇది కల్తీ కల్లు వల్లే జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. బాధ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని వెల్లడించారు. కల్లు డిపోలను కూడా సీజ్ చేశారని, కల్లు శాంపిల్స్ ను సేకరించి ఎక్సైజ్ కెమికల్ ల్యాబోరేటరీకి.. చికిత్స పొందుతున్న వారి శ్యాంపిల్స్ ను ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారని, నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?
భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కల్లు డిపోలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. మంత్రి వెంట ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్, నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప, నెఫ్రాలజీ విభాగాధిపతి డా. గంగాధర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు.
మూడుకు చేరిన మృతుల సంఖ్య
కూకట్‌పల్లి లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 15 మంది పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పరిస్థితి విషమించి ముగ్గురు మృతిచెందారు.
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్
Also Read : మామిడి రైతులకు అన్యాయం... ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే వచ్చా.. జగన్ కీలక వ్యాఖ్యలు
jupalli-krishnarao | nims-hospital | kukatpally latest news | kukatpally crime | kukatpally crime today | kukatpalli | toddy worker | toddy
Jupally Krishna Rao: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎవర్నీ వదలం... కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
కూకట్‌పల్లి కల్తీ కల్లు బాధితులను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు పరామర్శించారు. నిమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదలమని స్పష్టం చేశారు.
Jupally Krishna Rao