/rtv/media/media_files/2025/07/09/pulwama-2025-07-09-06-55-13.jpg)
Pulwama Attack
FATF Report on Pulwama Attack: ప్రపంచ వ్యాప్తంగా మనీలాండరింగ్(Money Laundering), టెర్రర్ ఫైనాన్సింగ్(Terror Financing) ను పర్యవేక్షించే అంతర్ ప్రభుత్వ సంస్థ ఎఫ్ఏటీఎఫ్(FATF)...ఉగ్రవాదం(Terrorists), దాని నిధులపై నివేదిక వెలువరించింది. ఇందులో ఉగ్రవాద సంస్థలకు డబ్బులు పూలింగ్ కు అధునాతన టెక్నాలజీ వాడుతున్నారని తెలిపింది. డిజిటల్ సాధనాలు, ఈ కామర్స్ ల ద్వారా మనీ సేకరించడం, తరలించడం వంటివి చేస్తున్నారని చెప్పింది. దీనికి అతి పెద్ద ఉదాహరణ 2019లో జరిగిన పుల్వామా దాడి(Pulwama Attack), 2022లో జరిగిన గోరఖ్ నాథ్ ఆలయ సంఘటన అని తెలిపారు. 2019 పుల్వామా దాడిలో ఈ-కామర్స్ ద్వారా పేలుడు పదార్థాలను సేకరించారు(E-commerce Explosives in Pulwama Attack). అలాగే 2022 గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన వ్యక్తి ISIS కు నిధులు సమకూర్చడానికి PayPal మరియు VPN లను ఉపయోగించారని ఎఫ్ఏటీఎఫ్ నివేదికలో వెల్లడించింది.
Also Read: యుగాంతం ఎఫెక్ట్.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు
అమెజాన్ లో పేలుడు పదార్థాలు..
ఇక 2019 ఫుల్వామా ఉగ్రదాడిలో అల్యూమినియం అల్యూమినియం పౌడర్ - ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (IEDలు) యొక్క పేలుడు శక్తిని పెంచడానికి ఉపయోగించే కీలకమైన భాగాన్ని ఉగ్రవాద సంస్థలు అమెజాన్(Amazon) ద్వారా తెప్పించుకున్నాయి. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. పుల్వామా దాడి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ చేయించింది. దాడికి సంబంధించిన లాజిస్టిక్స్, తయారీలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు పాత్ర పోషించాయని పరిశోధకులు కనుగొన్నారు.
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?
అలాగే 2022 గోరఖ్ నాథ్ ఆలయంలో ISIS ప్రేరేపిత వ్యక్తి భద్రతా సిబ్బందిపై దాడి చేశాడు. ఇందులో నిందితుడు పే పాల్ ఉపయోగించి దాదాపు 6.7 లక్షలను విదేశాలకు బదిలీ చేశాడని ఎఫ్ఏటీఎఫ్ చెప్పింది. అలాగే నిందితుడు తాను ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉండడానికి VPN సేవలను వినియోగించుకున్నాడు. నిందితుడు తన భారతీయ బ్యాంకు ఖాతా నుండి VPN ప్రొవైడర్లకు చెల్లింపులు కూడా చేశాడు. గత దశాబ్దంలో ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల వేగవంతమైన పెరుగుదల ఉగ్రవాదులకు కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి కొత్త మార్గాలను అందించిందని FATF నివేదిక సూచిస్తుంది. తరచుగా మారుపేర్లు మరియు నకిలీ ఖాతాల వినియోగాన్ని అనుమతించే P2P చెల్లింపులు చేస్తే ఉగ్రవాదులు పట్టుకోవడం కష్టమవుతుందని...అందుకే వారు దీనిని ఉపయోగిస్తున్నారని నివేదించింది.
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్
Also Read:చెడు కలలతో టార్చర్‌గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!