HCA: HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
HCA President Jagan Mohan Rao arrested by CBI

HCA President Jagan Mohan Rao arrested by CBI

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ ప్రాంచైజీ టీమ్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను టిక్కెట్ల కోసం బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై విజిలెన్స్ శాఖ  సమగ్ర దర్యాప్తు చేసింది. ఈ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏపై కేసు నమోదవ్వడంతో ఆ సంస్థ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు అరెస్టయ్యారు. 

Also Read: నాకు నోబెల్ బహుమతి రావాలి.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

HCA President Jagan Mohan Rao Arrested

ఇదిలాఉండగా గత ఐపీఎల్ మ్యాచ్‌లో SRH, HCA మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ సందర్భంగా టికెట్స్ ఇవ్వలేదని కార్పొరేట్ బాక్స్‌కు HCA తాళం వేసింది. దీంతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని SRH యాజమాన్యం తెలిపింది. దీనిపై విజిలెన్స్‌ విచారణకు రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు.. SRH యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి, ఇబ్బంది పెట్టినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. 

Also Read: కర్ణాటకలో సీఎం మార్పు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్‌

10 శాతం టికెట్లను SRH.. HCAకు ఫ్రీగా ఇవ్వగా మరో 10 శాతం టికెట్లు ఇవ్వాలని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. అయితే ఫ్రీగా 10 శాతం టికెట్లు ఇచ్చేది లేదని SRH యాజమాన్యం చెప్పగా.. ఒపెన్ మార్కెట్‌ కోనుగోలు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. అలాగే తనకు వ్యక్తిగతంగా 10 శాతం టికెట్లు కావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కానీ వ్యక్తిగతంగా ఇచ్చేందుకు SRH ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రావు.. SRH యాజమాన్యాన్ని ఒత్తిడికి గురి చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన్ని తాజాగా అరెస్టు చేశారు. 

Also Read :  రూ. 76 లక్షల ఫోర్జరీ కేసులో అలియా భట్ పీఏ అరెస్ట్ ! ఎవరీ వేదికా ప్రకాష్

Also Read :  గగన్‌యాన్‌ ప్రాజెక్టులో పురోగతి.. పరీక్షలు విజయవంతం

telugu-news | rtv-news | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు