Bihar Crime: అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అత్త, మేనల్లుడికి పెళ్లి ..  బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

బీహార్‌లోని సుపాల్ జిల్లాలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళను, ఆమె భర్త మేనల్లుడిని దారుణంగా కొట్టి వారిద్దరికి బలవంతంగా పెళ్లి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

New Update
bihar-crime

Bihar Crime

Bihar Crime: బీహార్‌లోని సుపాల్ జిల్లాలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళను, ఆమె భర్త మేనల్లుడిని దారుణంగా కొట్టి వారిద్దరికి బలవంతంగా పెళ్లి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.  జూలై 4న భీంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న  పోలీసులు 8 మంది నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీంపూర్ ప్రాంతంలో ఓ మహిళ, ఆమె భర్త మేనల్లుడు అక్రమ సంబంధంలో ఉన్నారని గ్రామస్తులు అనుమానించారు.

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

వారిద్దరినీ పట్టుకుని బహిరంగంగా

ఈ అనుమానం ఆధారంగా గ్రామస్తులు వారిద్దరినీ పట్టుకుని బహిరంగంగా కొట్టారు. అంతేకాకుండా వారిద్దరికి బలవంతంగా వివాహం కూడా చేశారు. ఈ దాడిలో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికి నిందితులందరూ పారిపోయారని భీమ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మిట్లేష్ పాండే తెలిపారు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు జరుగుతోందని త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. వాస్తవానికి వారిద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదని యువకుడి తండ్రి చెబుతున్నారు. 

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

Also read :  Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. ఆ ఆలయంలో శ్యామలా దేవి ప్రత్యేక పూజలు!

Advertisment
తాజా కథనాలు