/rtv/media/media_files/2025/07/08/cm-nitish-kumar-2025-07-08-16-25-56.jpg)
CM Nitish Kumar
ఈ ఏడాది చివర్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదనుపెడుతున్నాయి. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు హామీలు ప్రకటిస్తున్నాయి. తాజాగా సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బిహార్‌లో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని పోస్టులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపారు.
Also Read: ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి
Also Read : శ్రీ రాముడు నేపాల్‌లో జన్మించాడు.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
CM Nitish Kumar Announces 35 Percent Reservation For Bihar Women
దీనివల్ల ప్రభుత్వ సర్వీసుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించడనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజధాని పట్నాలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే యువత కోసం బిహార్ యూత్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దీనికింద యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, శిక్షణ అందిస్తామని తెలిపారు. అలాగే ఈ కమిషన్ మెరుగైన విద్య, ఉపాధి అంశంలో ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మేఘాలయాలో దారుణం..యువకుడితో టాయిలెట్ నీళ్ళు తాగించిన పోలీసులు
మరోవైపు బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్‌లో జరగనున్నాయి. దీంతో అధికారపక్షమైన NDA, విపక్ష మహాగట్ బంధన్ పోటీకి సిద్ధమవుతున్నాయి. మహాగట్ బంధన్ ఇప్పటికే సీట్ల పంపణీ కోసం పలు సమావేశాలు నిర్వహించింది. దీనికి అన్ని పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు. అయితే పలు పార్టీ తమకు ఎక్కువ సీట్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు విపక్ష కూటమిలోని పార్టీలు తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల జాబితా ఇవ్వాలని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ కోరారు. మరి ఈ ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది.
Also Read : Bomb Threats : హైదరాబాద్‌లో బాంబు బెదిరింపులు...బాంబు స్క్వాడ్ షాక్..
nitish-kumar | bihar-assembly-elections | rtv-news | telugu-news