AP Crime: కొంపముంచిన ఓవర్ స్పీడ్.. పుణ్యక్షేత్రాల కోసమని వెళ్లి అనంత లోకాలకు!

తిరుమలలో రోఘ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం ముగిసి అరుణాచలేశ్వర స్వామివారి దర్శనాని వెళ్తుండగా కారు పాల ట్యాకర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడి మృతి చెందగా కుతూరు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Vijayawada Crime news

Vijayawada Crime news

AP Crime: పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లిన ఒక కుటుంబం ఓ రోడ్డు ప్రమాదం(Road Accident)లో ప్రాణాలు కోల్పోయారు. తిరుమల శ్రీవారి దర్శనంతో ప్రారంభమైన ఈ యాత్ర, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామివారి దర్శనంతో కొనసాగింది. అనంతరం విజయవాడకు తిరిగి వస్తుండగా చంద్రగిరి మండలం తొండవాడ సమీపం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగి ఆ కుటుంబంలో తల్లీ కుమారుడి ప్రాణాలను బలిగొన్నది. స్థానిక  వివరాల ప్రకారం..

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

అయ్యో దేవుడా.. దర్శనానికి వస్తే..

విజయవాడకు చెందిన కోటేశ్వరరావు కుటుంబం ఈ యాత్రకు బయలుదేరింది. ఆయన భార్య పద్మావతి (38), కుమారుడు జశ్వంత్‌సాయి (21), అక్క హేమలతతో కలిసి స్వంత కారులో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు పాల ట్యాకర్‌ను వేగంగా(Car Over Speed) ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న కోటేశ్వరరావు ఎయిర్‌బెలూన్‌ సౌలభ్యం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే కుమారుడు జశ్వంత్‌సాయి, అక్క హేమలత తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు.

ఇది కూడా చదవండి:  మీకు తెలుసా ఈ ఫేస్ ప్యాక్ 15 నిమిషాల్లో ముఖం మిలమిల మెరిసిపోతుంది!

ప్రమాదం జరిగిన వెంటనే భాకరాపేట సీఐ ఇమ్రాన్‌ బాషా నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న జశ్వంత్‌సాయి పరిస్థితి విషమించి మృతి చెందాడు. పద్మావతి మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాల మోర్చరీకి తరలించారు. ప్రమాదం సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహన వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: కొత్తిమీర-జీలకర్ర ఆరోగ్యానికి ప్రయోజనాలు తెలుసా..?

Also Read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు