TG Crime: కొడుకు ఇద్దరు భార్యల లొల్లి... మధ్యలో అత్త బలి!

హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలను ఆపే క్రమంలో వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కిషన్‌బాగ్‌కు చెందిన మహమూద్‌గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Bahadurpura Crime News

Bahadurpura Crime News

TG Crime: హైదరాబాద్‌ నగరంలోని బహదూర్‌పుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలను ఆపే క్రమంలో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కిషన్‌బాగ్‌కు చెందిన మహమూద్‌ (45) అనే వ్యక్తికి గతంలో ఒక వివాహం కాగా.. ఇటీవల షహజాదీ బేగం అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి.  ఇద్దరు భార్యల మధ్య తరచూ వాగ్వాదాలు, గొడవలు జరుగుతుండగా.. పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి.

కోడళ్ల గొడవ ఆపేందుకు వెళ్లి..

సోమవారం రాత్రి కూడా ఇద్దరు భార్యలు ఓ చిన్న విషయంపై ఘర్షణకు దిగారు. వారి గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో మహమూద్‌కు అత్త అయిన మహమూద్‌బీ (65) వారు పరిస్థితిని పరిష్కరించేందుకు మధ్యలో జోక్యం చేసుకుంది. ఆమె వారిద్దరిని శాంతింపజేయబోయే సమయంలో అనుకోకుండా తోపులాట జరిగింది. ఇద్దరు కోడళ్ల మధ్య చోటుచేసుకున్న తోసుకోవడంలో మహమూద్‌బీ కింద పడిపోయింది. వృద్ధురాలైన ఆమెకు ఈ దెబ్బ తీవ్రంగా తగిలినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:  కీర దోసకాయను కోసి ఇలా చేస్తే చెదు తగ్గుతుందా..? మీరూ తప్పకుండా తెలుసుకోండి

ఈ ఘటనలో ఆమెను కుటుంబ సభ్యులు తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. వృద్ధురాలి మృతి కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పటల్‌ మార్చురీకి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: కొంపముంచిన ఓవర్ స్పీడ్.. పుణ్యక్షేత్రాల కోసమని వెళ్లి అనంత లోకాలకు!

( TG Crime | crime news | crime | Latest News | telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు