/rtv/media/media_files/2025/07/09/lrlacm-2025-07-09-17-34-27.jpg)
India’s "unofficial offering" of S400-evading cruise missile to Greece shakes Turkey
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ కూడా భారత్‌పై డ్రోన్లను ప్రయోగించింది. కానీ భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే ఆ సమయంలో పాకిస్థాన్ టర్కీకి చెందిన డ్రోన్లను వినియోగించింది. అంతేకాదు భారత్.. పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేయడాన్ని కూడా టర్కీ ఖండించింది. పాకిస్థాన్‌కే మద్దతుగా నిలిచింది. మొత్తానికి టర్కీ భారత్‌కు వ్యతిరేకంగా ఉందని తేలిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు టర్కీ షాకయ్యేలా ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
ఓ రిపోర్ట్ ప్రకారం.. టర్కీ శత్రు దేశమైన గ్రీస్.. భారత్ నుంచి ప్రత్యేక క్షిపణిని కోరింది. ఇది చాలా ప్రాణాంతకమైనది. శత్రువు దాగిఉన్న ఏ ప్రదేశాన్నైనా ఇది క్షణాల్లోనే నాశనం చేయగలదు. 'ది వీక్' అనే ప్రముఖ పత్రికలో వచ్చిన నివేదిక ప్రకారం.. గ్రీస్ భారత్ నుంచి అత్యాధునిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM)ను కోరుతోంది. ఒకవేళ భారత్.. గ్రీస్‌కు ఈ క్షిపణిని ఇస్తే అది వ్యూహాత్మక చర్య కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: గగన్‌యాన్ ప్రాజెక్టులో పురోగతి.. పరీక్షలు విజయవంతం
Also Read : రూ. 76 లక్షల ఫోర్జరీ కేసులో అలియా భట్ పీఏ అరెస్ట్ ! ఎవరీ వేదికా ప్రకాష్
India’s "Unofficial Offering" Of S400-Evading Cruise Missile
LRLACM క్షిపణిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. ఇది సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఈ మిస్సైల్ ఎయిర్‌పోర్టులు, రాడర్ స్టేషన్లు, కమాండ్ సెంటర్‌లో పాటు ఇతర శత్రు దేశాలకు చెందిన లక్ష్యాలను క్షణాల్లోనే నాశనం చేయగలదు. దీన్ని భూమి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. భూమి నుంచి ప్రయోగిస్తే దీని రేంజ్ 1500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ నావికాదళ నౌక నుంచి ప్రయోగిస్తే.. 1000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అయితే ఈ క్షిపణి టర్కీలోని చాలా ప్రాంతాలను కవర్ చేయగలదు. అంతేకాదు ఇది గంటకు 864 కిలోమీటర్ల నుంచి 1111 కిలోమీటర్ల వేగంతో లక్ష్యాలను ఛేదించగలదు.
ఈ క్షిపణి భూమికి చాలా దగ్గరగా వెళ్తుండటం వల్ల రాడార్‌కు కూడా సులభంగా చిక్కుకోదు. అమెరికా ఇలాంటిదే టోమాహాక్ అనే క్షిపణి ఉంది. రష్యా వద్ద కూడా క్యాలిబర్ అనే ఇలాంటి రకమైన క్షిపణి ఉంది. ఇది కూడా రాడర్‌ను నుంచి తప్పించుకోగలదు.
LRLACMను మొబైల్ లాంచర్ లేదా యూనివర్సల్ వర్టికల్ లాంచ్ మాడ్యూల్ ద్వారా ప్రయోగించవచ్చు. ఇప్పటికే భారత నావికాదళంలోని 30 యుద్ధ నౌకల్లో దీన్ని మోహరించారు.
ఇదిలాఉండగా.. మరోవైపు టర్కీతో సంబంధాలు మెరుగుపర్చుకుంటోంది. మంగళవారం టర్కీ రక్షణశాఖ ఉన్నతాధికరి హలుక్ గోర్గన్ ఢాకా చేరుకున్నట్లు బంగ్లాదేశ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్, నారాయణగంజ్‌లో టర్కీ సాయంతో రెండు రక్షణ పారిశ్రామిక మండలాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే భారత్‌పై నిఘా ఉంచేందుకు టర్కీకి ఇది సులభతరం అవుతుంది. ఇది దాని మిత్రదేశమైన పాక్‌కు కూడా ఉపయోగపడుతోందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కర్ణాటకలో సీఎం మార్పు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్
బంగ్లాదేశ్, పాకిస్థాన్, టర్కీ.. ఈ మూడు కూడా ఓ వ్యూహాత్మక కూటమిగా ఏర్పడితే.. ఇది భారత్‌పై ప్రభావం చూపుతుంది. బంగ్లాదేశ్ భారత్‌కు మూడు వైపులా ఉండటంతో ఈ దేశాల నిఘా వ్యవస్థ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు భారత్‌కు మిత్రదేశాలుగా ఉన్న టర్కీ, బంగ్లాదేశ్‌లు ఇప్పుడు కావు. ఈ మూడు దేశాల సాన్నిహిత్యం భారత భద్రతకు ముప్పు కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రీస్‌కు భారత్ నుంచి LR-LACM క్షిపణి వెళ్తే.. టర్కీ నియంత్రణలో ఉంటుందని భావిస్తున్నారు.
Also Read : గగన్‌యాన్ ప్రాజెక్టులో పురోగతి.. పరీక్షలు విజయవంతం
greece | turkey | missile | rtv-news | telugu-news