/rtv/media/media_files/2025/07/09/drugs-racket-busted-in-hyderabad-2025-07-09-18-52-22.jpg)
Drugs Racket Busted in Hyderabad
హైదరాబాద్ లో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. రెస్టారెంట్లు వేదికగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మల్నాడు, టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ కేసులో కీలకంగా ఉన్నారని ఈగల్ టీం స్పష్టం చేసింది. ఈగల్ టీం ఆపరేషన్‌లో డ్రగ్స్ దందా బయటపడిందని వివరించింది.హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బు యజమానులు కలిసి డ్రగ్స్ వాడకం మొదలు పెట్టారని, వీరిలో సూర్య కీలక సూత్రధారిగా ఉన్నారన్నారు.
Also Read : HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు
Drugs Rocket Busted In Hyderabad
కొరియర్ ద్వారా పలువురు ఆఫ్రికన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఈ దందాలో కీలకంగా ఉన్న 25 మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని ప్రిజమ్ పబ్, జూబ్లిహిల్స్ ఫామ్ పబ్,మాదాపూర్‌లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో డ్రగ్స్ తదితర పబ్‌లు ఇందులో కీలకంగా ఉన్నాయని టీం వెల్లడించింది.డ్రగ్స్ రాకెట్‌లో క్వేక్ అరేనా పబ్, బ్రాడ్‌వే, జోరా పబ్స్ కూడా భాగస్వాములని తేల్చింది.
Also Read : నాకు నోబెల్ బహుమతి రావాలి.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఈగల్ టీం కేసు నమోదు చేసిన వారిలో A-1గా కొంపల్లి, టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్య అన్నమనేని డ్రగ్ కింగ్‌పింగ్ గా తేల్చారు. ఇక A-2. పల్లెపాక మోహన్, ఖాజాగూడ,A-3. నిక్, డ్రగ్ పెడ్లర్ ఇంటర్నేషనల్, A-4. హర్షా, హిమాయత్‌నగర్, A-5. విక్రమ్ రెడ్డి, భీమవరం, A-6. మూసాల యశ్వంత్ రమణా, మేడ్చల్, A-7. ప్రిన్స్, న్యూ ఢిల్లీ, A-8. జెర్రీ, బెంగళూరు, A-9. స్టాన్లీ, నైజీరియా, డ్రగ్ పెడ్లర్, A-10. డెజ్మాండ్, నైజీరియా, డ్రగ్ పెడ్లర్, A-11. నవదీప్ రెడ్డి, కొకాపేట్, A-12. సందీప్ జువ్వాడి, కరీంనగర్, తబ్లా రాసా, A-13. వెంకట్, విజయవాడ, A-14. సురభి జశ్వంత్, మణికొండ, A-15. సునీల్, బెంగళూరు, A-16. ప్రసన్న, భీమవరం, A-17. సందీప్ కురపాటి, మణికొండ, A-19. దుగ్యాల పవన్ కుమార్, బంజారాహిల్స్, A-20. శ్రీదీప్, A-21.తనూజ, అయ్యప్ప సొసైటీ, A-22. పృథ్వీ వీరమాచినేని, జోరా పబ్ MD, జూబ్లీహిల్స్, A-23. రోహిత్ మెడిశెట్టి, బ్రాడ్‌వే పబ్ MD, జూబ్లీహిల్స్,A-24. రాజా శ్రీకర్, క్విక్ ఎరీనా పబ్ MD, కొండాపూర్ తదితరులపై కేసు నమోదు చేశారు.
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?
Also Read : పెంపుడు కుక్క వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా! సర్వేలో షాకింగ్ విషయాలు
pubs | hyderabad-pubs | pubs in hyderabad | drugs-case-telugu | drugs-case-hyderabad | drugs-in-hyderabad | drugs-in-jubilee-hills | drugs-party | hyderabad-drugs | madhapur-drugs-case