/rtv/media/media_files/2025/07/09/arvind-kejriwal-2025-07-09-18-26-58.jpg)
Arvind Kejriwal
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ నిరంతరం అడ్డంకులు పెట్టినప్పటికీ ఢిల్లీ ప్రజలకు మంచి పాలనను అందించానని చెప్పారు. ఇందుకుగాను తాను నోబెల్ బహుమతికి అర్హుడినని తెలిపారు. పంజాబ్‌లోని మొహాలిలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉన్నంత కాలం మేము పనిచేశాం. ''నేను సీఎంగా ఉన్న సమయంలో ఢిల్లీకి చేసిన పనులు, పరిపాలనకు నోబెల్ బహుమతి పొందాలని భావిస్తున్నానని'' కేజ్రీవాల్ అన్నారు.
Also Read: గుంటనక్క టర్కీపై భారత్ రివేంజ్.. ఆ దేశంపైకి మన మిస్సైళ్లు!
I Should Get A Nobel Prize Arvind Kejriwal
మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్న్ వీకే సక్సేనాపై కూడా కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సూచనల మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ పథకాలు గాడినతప్పేలా చేశారంటూ ధ్వజమెత్తారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌లను ఆప్ నిర్మించిందని చెప్పారు. కానీ బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్‌కు బుల్డోజర్లు పంపించి ఐదు మొహల్లా క్లినిక్‌లను కూల్చివేశారని విమర్శించారు.
Also Read: కర్ణాటకలో సీఎం మార్పు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్
అలాగే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లోనే పరిస్థితులు దిగజారాయని కేజ్రీవాల్ ఆరోపించారు. మొహల్లా క్లినిక్‌లు మూసివేశారని విమర్శలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, 20 వేల లీటర్ల ఉచిత నీరును ఆప్ ప్రభుత్వం అందించిందని చెప్పారు. బీజేపీ పాలనలో పథకాలు గాడినతప్పడంతో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఆప్ చేసిన సేవలను గ్రహిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Also Read : నాకు నోబెల్ బహుమతి రావాలి.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
Also Read : రూ. 76 లక్షల ఫోర్జరీ కేసులో అలియా భట్ పీఏ అరెస్ట్ ! ఎవరీ వేదికా ప్రకాష్
arvind-kejriwal | aap | rtv-news | telugu-news