/rtv/media/media_files/2025/07/09/bharat-bandh-2025-07-09-06-56-23.jpg)
Bharat Bandh: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కీలక ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు నేడు దేశవ్యాప్తంగా భారీ సమ్మెకు(Workers Strike Today) సిద్ధమవుతున్నారు. భారత్ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా సేవలు స్తంభించిపోతాయి. బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు సమ్మె కారణంగా ప్రభావితమవుతాయి. సహకార బ్యా్ంకులు పనిచేయకపోయిన ప్రైవేట్ బ్యాంకులు పనిచేయవచ్చు.
Also Read: యుగాంతం ఎఫెక్ట్.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు
ఈ రోజు అధికారిక బ్యాంకింగ్ సెలవు లేనప్పటికీ, శాఖలు, ATMలలో సేవలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రైవేటు ఆఫీసులు యథావిధిగా నడుస్తాయి. రవాణా విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. 27 లక్షలకు పైగా విద్యుత్ రంగ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు కాబట్టి.. విద్యుత్ సరఫరాపై కూడా ప్రభావం పడవచ్చు. రైల్వేలు ఎటువంటి అధికారిక సమ్మె నోటీసును జారీ చేయలేదు. ఇక స్కూళ్లు, కాలేజీలు కూడా బంద్ పడే అవకాశం ఉంది.
Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?
రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంఘాల మద్దతుతో 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ నిరసనలో పాల్గొంటారని AITUCకి చెందిన అమర్‌జీత్ కౌర్ తెలిపారు. మోదీ సర్కార్ గత 10 సంవత్సరాలలో వార్షిక కార్మిక సమావేశాన్ని కూడా నిర్వహించలేదని అన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) తో అనుబంధంగా ఉన్న బెంగాల్ ప్రావిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంకింగ్, బీమా రంగాలు రెండూ సమ్మెలో పాల్గొంటాయి.
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్
ఈ సమ్మె కేవలం అధికారిక రంగ ఉద్యోగులకే పరిమితం కాదు. అనధికారిక రంగానికి చెందిన కార్మికులు, స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA) వంటి స్వయం ఉపాధి సంఘాలు, గ్రామీణ సంఘాలు కూడా పాల్గొంటాయి. ఈ నిరసనకు సంయుక్త కిసాన్ మోర్చా వంటి రైతు వేదికల నుండి మద్దతు లభించింది. NMDC లిమిటెడ్, స్టీల్ ప్లాంట్లు, రైల్వే ఆపరేషన్స్ వంటి కీలక పరిశ్రమల నుండి ప్రభుత్వ రంగ ఉద్యోగులు కూడా సంఘీభావం తెలిపారు.
Also Read:చేతుల్లో ఈరాయి ఉంటే చాలు థైరాయిడ్ కారణంగా పెరిగిన బరువుని తగ్గించుకోవచ్చు
బంద్ లో పాల్గొనే సంస్థలు:
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU)
హింద్ మజ్దూర్ సభ (HMS)
స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA)
లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF)
యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC)
సంయుక్త కిసాన్ మోర్చా వంటి రైతు సంఘాలు
గ్రామీణ కార్మిక సంఘాలు
పార్లమెంటు ఆమోదించిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను కార్మిక సంఘాలు వ్యతిరేకించడం బంద్ కు కేంద్ర బిందువుగా మారింది. 2020, 2022, 2024లో జరిగిన ఇలాంటి దేశవ్యాప్త సమ్మెలలో లక్షలాది మంది కార్మికులు నిరసనగా బంద్ లో పాల్గొన్నారు.