YS Jagan : మామిడి రైతులకు అన్యాయం... ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే వచ్చా.. జగన్‌ కీలక వ్యాఖ్యలు

మామిడి రైతులను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, వారికి అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించిన జగన్‌ బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

New Update
YS Jagan On AP Liquor Scam

YS Jagan On chitoor

మామిడి రైతులను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, వారికి అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించిన జగన్‌ బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆగం చేసిందని ఆరోపించారు. రైతుల్ని రౌడీషీటర్లతో పోల్చుతారా? రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మాట్లాడేందుకు కేవలం 500 మంది మాత్రమే రావాలని ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. జగన్‌ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారన్నారు.

Also Read: పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్

Injustice To Mango Farmers - YS Jagan

రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. రైతులు రాకుండా ఆంక్షలు విధించారని,అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారన్నారు. ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. వరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా? అని జగన్ ప్రశ్నించారు. ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారని వెళ్లడించారు. కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం? అని  చంద్రబాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 

ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్‌ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి. దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్‌ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు. నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు అని జగన్‌ ప్రశ్నించారు.కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు.మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది.అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారని వెల్లడించారు.

Also Read: పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్

ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు.6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు. మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు.ఇంకా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది.ఇవాళ అన్ని వ్యవస్థలునిర్వీర్యమయ్యాయని జగన్ ఆరోపించారు.ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలని జడన్‌ డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక. అంటూ ఆయన వార్నింగ్‌ ఇచ్చారు.

ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఇక తన పర్యటనకు వచ్చే రైతులను అడ్డుకోవడంపై కూడా ఆయన స్పందించారు.ఎందుకు రైతులను రానీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా? అంటూ జగన్‌ మండిపడ్డారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్‌ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్‌ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్‌ ముందు ఉంటున్నాడు.వచ్చేది జగన్‌ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి..అంటూ జగన్‌ స్పష్టం చేశారు.

Also Read : గుమ్మడికాయ ఏ వ్యక్తులు తినకూడదో తెలుసా..? అది తీవ్రమైన హాని కలిగిస్తుంది

Also Read :  పెంపుడు కుక్క వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా! సర్వేలో షాకింగ్ విషయాలు

formers | formers-protest | chandrababu vs ys jagan | chittor ys jagan tour | ys jagan chitoor tour updates | chitoor-district

Advertisment
Advertisment
తాజా కథనాలు