/rtv/media/media_files/2025/07/09/ramya-murder-2025-07-09-06-35-23.jpg)
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన రమ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు ప్రవీణ్‌కుమారే ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమపెళ్లికి యువతి తల్లిదండ్రులు నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి కూడా స్పందించకపోవడంతో కక్ష పెంచుకున్న ప్రియుడు రమ్యను హత్య చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే యువతని హత్య చేసిన తరువాత ప్రియుడు ప్రవీణ్ కుమార్ తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని కత్తితో మెడ, గుండె మీద పొడుచుకున్నాడు కానీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం
మెదక్ జిల్లా వెల్దురి మండలం మాణెపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్(25) రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఉండే డిగ్రీ ఫైనల్ విద్యార్థిని రమ్య(23) మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ ప్రేమ విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు ప్రవీణ్‌కుమార్ ఆరు నెలల క్రితం చెప్పాడు. అయితే అందుకు రమ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో రమ్యకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. దీంతో రమ్య కూడా ప్రవీణ్ ను దూరం పెడుతూ వచ్చింది. దీంతో తనకు తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో లోలోపల రగిలిపోయిన ప్రవీణ్ .. రమ్యను చంపాలని ఫిక్స్ అయ్యాడు. సోమవారం ఉదయం రమ్య తల్లిదండ్రులు పనులకు వెళ్లినట్లు గుర్తించి వెనుక వైపు నుంచి ఇంట్లోకి దూకాడు. ఇంట్లోకి వెళ్లి రమ్యతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు. రమ్య మాట వినకపోవడంతో కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. ఇక తాను కూడా బతకలేననే ఉద్దేశంతో కత్తితో పొడుచుకున్నాడు. ప్రవీణ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ఇక ప్రవీణ్ కుటుంబ విషయానికి వస్తే అతని తండ్రి 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు. తల్లి వీరితో ఉండడం లేదు. ప్రవీణ్‌కు ఓ సోదరుడు నాగరాజు ఉన్నాడు. అతడు ప్రస్తుతం క్యాబ్‌డ్రైవరుగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నతనం నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగాడు ప్రవీణ్. ప్రస్తుతం ట్యూషన్లు చెబుతున్నాడు.