Aadhaar: ఆధార్‌ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదు.. ఉడాయ్ సీఈవో కీలక వ్యాఖ్యలు

సాధారణంగా మన గుర్తింపు కోసం చూపించే మొదటి ప్రూఫ్‌ ఆధార్ కార్డ్. అయితే ఉడాయ్ సీఈవో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డ్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదని తెలిపారు. నకిలీ ఆధార్‌కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

New Update
Aadhaar Card

Aadhaar Card

సాధారణంగా మన గుర్తింపు కోసం చూపించే మొదటి ప్రూఫ్‌ ఆధార్ కార్డ్. అయితే ఉడాయ్ సీఈవో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డ్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదని తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఇది బిహార్‌లో రాజకీయాల్లో చర్చనీయం అవుతోంది. ఈ ఏడాది చివర్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల నుంచి ఆధార్‌ కార్డును మినహాయించాలనే అంశంపై వివాదం నడుస్తోంది. 

Also read: డబుల్ ఇంజిన్‌ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు

Also Read :  కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానం.. పైలట్ మృతి

Aadhaar Is NEVER The First Identity

ఈ క్రమంలోనే భారతీయ విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) సీఈవో భువనేశ్ కుమార్ దీనిపై స్పందించారు.  ఆధార్ కార్డ్ ఎప్పుడూ కూడా తొలి గుర్తింపు కాదని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ ఆధార్‌కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్యూఆర్‌ కోడ్ స్కానర్ యాప్‌ సాయంతో ఫేక్ ఆధార్ కార్డులు గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఫేక్ ఆధార్ కార్డులు ఎవరైనా తయారుచేసినా కూడా ఈ యాప్ ద్వారా వాటిని చెక్‌ చేసి అడ్డుకోవచ్చని స్పష్టం చేసారు.  

Also Read: పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్

అలాగే ప్రస్తుతం కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి దశలో ఉందని అన్నారు. ఈ కొత్త యాప్‌ ప్రజలకి అందుబాటులోకి వస్తే..  ఇక ఆధార్ ఫిజికల్ కాపీలు పంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇకనుంచి మాస్క్‌ వెర్షన్ కీలకం కానుంది. వినియోగదారుల సమ్మతిని బట్టి ఆధార్ కార్డు వివరాలను పూర్తి లేదా మాస్క్ ఫార్మాట్‌లో పంచుకునే అవకాశం ఉంటుంది. 

Also Read :  గుమ్మడికాయ ఏ వ్యక్తులు తినకూదో తెలుసా..? అది తీవ్రమైన హాని కలిగిస్తుంది

aadhar-card | national-news | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు