🔴Live News Updates: వైసీపీకి బిగ్ షాక్‌.. టీడీపీలోకి జగన్‌ సోదరుడు !

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

BIG Breaking : సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన.. భర్తతో విడాకులు తీసుకుంటున్నా

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఏడేళ్ల వివాహ బంధానికి,  20 ఏళ్ల స్నేహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా ఆమె తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

saina--nehwal

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఏడేళ్ల వివాహ బంధానికి,  20 ఏళ్ల స్నేహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా ఆమె తన సోషల్ మీడియాలో వెల్లడించారు.  35 ఏళ్ల భారత సీనియర్ స్టార్ సైనా జూలై 13 ఆదివారం అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు.  చాలా ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె తెలిపారు.  

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

"జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన, చర్చల తర్వాత, కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము మా శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాము" అని సైనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాల్సిందిగా కోరారు.

Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

2018లో ప్రేమించి పెళ్లి

కాగా వీరిద్దరూ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలుసుకున్నారు, అక్కడ ఇద్దరూ లెజెండరీ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు. ఇక్కడే వారిద్దరి ప్రేమకథ ప్రారంభమైంది. అయితే వారి విడిపోవడానికి అసలు కారణం ఇంకా తెలియకపోయినా, కశ్యప్‌తో గడిపిన క్షణాలకు సైనా సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

సైనా తన ఒలింపిక్ కాంస్య పతకం, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్‌తో ప్రపంచ ఐకాన్‌గా మారారు. కరణం మల్లేశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ ఆమె. 2015లో, సైనా మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. సైనా చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఆడింది.

Also Read: ఏరా బుద్దుందా..  అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!

ఇక కశ్యప్ ప్రపంచ టాప్ 10లోకి ప్రవేశించి 2014 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాన్ని సాధించాడు. 2024 ప్రారంభంలో తన క్రీడా జీవితాన్ని ముగించినప్పటి నుండి కశ్యప్ కోచింగ్‌ను ప్రారంభించాడు.

  • Jul 14, 2025 21:43 IST

    వైసీపీకి బిగ్ షాక్‌.. టీడీపీలోకి జగన్‌ సోదరుడు !

    వైసీపీ అధినేత జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తాము పూర్తిగా సహకరిస్తామని జగన్‌ సోదరుడు దుష్యంత్‌ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

     

    YCP Leader Dushyant Reddy likely To Join TDP
    YCP Leader Dushyant Reddy likely To Join TDP

     



  • Jul 14, 2025 21:23 IST

    లార్డ్స్ టెస్ట్‌లో భారత్ ఘోర ఓటమి!



  • Jul 14, 2025 21:03 IST

    భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. 10 లక్షలమందికి ఉపాధి

    రష్యాలో పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక శక్తి కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు ఆ దేశం భారత్‌పై ఫోకస్‌ పెట్టింది. 2025 చివరి నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులకు రష్యా ఉపాధి కల్పించనున్నట్లు సమాచారం.

     

    Russia to import 1 million skilled workforce from India
    Russia to import 1 million skilled workforce from India

     



  • Jul 14, 2025 18:09 IST

    వరంగల్ డాక్టర్ జీవితాన్ని బుగ్గిపాలు చేసిన బుట్టబొమ్మ.. ఇన్ఫ్లూయెన్సర్‌పై భర్త మోజు.. భార్య ఆత్మ*హత్య!

    వరంగల్ మెడికవర్‌లో డాక్టర్‌గా వర్క్ చేస్తున్న సృజన్ ఓ ఇన్ఫ్లూయెన్సర్‌ మోజులో పడి, భార్య ప్రత్యూషకు విడాకులు ఇస్తానని బెదిరించారు. ఆ యువతి మోజులో పడి తనని, పిల్లలను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది డాక్టర్ ప్రత్యూష్ పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

     

    Warangal Doctor
    Warangal Doctor

     



  • Jul 14, 2025 17:13 IST

    Kota Srinivasa Rao: ''చచ్చేదాక నటించాలి''.. కోట మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!

    "చనిపోయే దాకా నటించాలి... చనిపోయిన తర్వాత నటుడిగా  బతకాలి" అనేదే తన జీవిత ఆశయం అని చెప్పారు కోట. ఈ మాట ఆయనకు  నటన  పట్ల ఉన్న అంతులేని ప్రేమకు, అంకితభావానికి నిదర్శనం! చివరిరోజుల్లో  కూడా నటించాలనే ఆయన తపన  అనంతం.

    kota cinema offers



  • Jul 14, 2025 16:49 IST

    చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

    భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్‌ గవాయ్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఆస్పత్రిలో చేరారు.

     

    CJI B.R. Gavai contracts infection, being treated in Delhi
    CJI B.R. Gavai contracts infection, being treated in Delhi

     



  • Jul 14, 2025 16:39 IST

    Wimbledon 2025: అల్కరాజ్‌‌ను ఓడించి.. వింబుల్డన్‌ కొత్త ఛాంపియన్‌గా సినర్‌

    ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ స్టార్ జానిక్ సినర్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌ను 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించాడు. దీంతో సినర్ తన మొదట వింబుల్డన్ గెలుచుకున్నాడు.

     

    Jannik Sinner
    Jannik Sinner

     

     

     

     



  • Jul 14, 2025 16:09 IST

    ENG vs IND: లార్డ్స్‌లో ఛేజింగ్ ఖాయమే.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

    లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమిండియా మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ వేదికలో భారత్ చివరిగా 1986లో విజయం సాధించింది. ఆ తర్వాత 1990, 2002లో భారత్ ఓటమి పాలైంది. ఈసారి ఇంగ్లాండ్ ఇచ్చిన 193 పరుగులు లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందో లేదో చూడాలి.

     

    Team India captain Shubman Gill scored a century in the second Test in England
    Team India captain Shubman Gill scored a century in the second Test in England

     



  • Jul 14, 2025 15:14 IST

    తిరుపతిలో రైళ్లలో మంటలు.. రెండు భోగీలు పూర్తి దగ్ధం

    తిరుపతిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు బోగీల్లో మంటలు చేలరేగాయి. లూప్‌లైన్లలో ఉన్న రాయలసీమ, షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో రెండు భోగీల్లో మంటలు చెలరేగి.. పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

     

    Train
    Train

     



  • Jul 14, 2025 14:44 IST

    నిమిష ప్రియను కాపాడలేం.. కేంద్రం సంచలన ప్రకటన

    జులై 16న కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. నిమిష ప్రియకు పడిన ఉరిశిక్ష ఆపేందుకు భారత్‌ వద్ద పెద్దగా ఎలాంటి మార్గాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది.

     

    Centre to Supreme Court on Indian nurse Nimisha Priya's execution case in Yemen
    Centre to Supreme Court on Indian nurse Nimisha Priya's execution case in Yemen

     



  • Jul 14, 2025 14:26 IST

    గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు

    టీడీపీ సీనియన్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మూడు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. హర్యానా అషింకుమార్, లద్దాఖ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాను నియమితులయ్యారు. 

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jul 14, 2025 13:55 IST

    Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

    ఆక్సియమ్ స్పేస్ ప్రకారం, ఆక్సియమ్ మిషన్ 4 బృందం 580 పౌండ్లకు పైగా (సుమారు 263 కిలోగ్రాములు) వస్తువులను తిరిగి తీసుకువస్తున్నారు. వీటిలో ప్రధానంగా 60కి పైగా ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు, పరిశోధనా నమూనాలు ఉన్నాయి.

    Shubhanshu Shukla



  • Jul 14, 2025 12:43 IST

    Famous Celebrity Divorces: సైనా నెహ్వాల్, ఏఆర్ రెహమాన్, జయం రవితో పాటు.. ఇటీవల విడాకులు తీసుకున్న ప్రముఖులు వీరే!

    భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో విడాకులు తీసుకున్న ప్రముఖులు వార్తల్లో నిలిచాయి. హార్దిక్ పాండ్యా, ఏఆర్ రెహమాన్, సానియా మీర్జా, జీవీ ప్రకాష్ కుమార్, జయం రవి ఉన్నారు.

     

    Famous Celebrity Divorces
    Famous Celebrity Divorces

     



  • Jul 14, 2025 12:42 IST

    Sperm Count Tips: స్పెర్మ్ కౌంట్ త్వరగా పెరగాలంటే ఈ జూస్ తాగండి.. వరదలా పారుతాయి!

    రోజు పొద్దున మొలకెత్తిన విత్తనాలు (Sprouts)  తినండి. ఆ తరువాత ఓ గంటసేపు గ్యాప్ ఇచ్చి ఏదైనా ఓ పండు లేదా కూరగాయ జూస్ తాగండి.. మళ్లీ మధ్యాహ్నం అన్నం తినేయండి.. రాత్రికి అన్నం బదులుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ నాలుగు రకాలు పెట్టుకుని తినండి.

    sperm-count



  • Jul 14, 2025 12:01 IST

    After Sex Telugu Tips: సె*క్స్ తర్వాత ఈ పనులు ఖచ్చితంగా చెయ్యాలి.. లేదంటే చాలా డేంజర్!

    శృంగారం తర్వాత కొన్ని పనులు చేయకూడదు. ముఖ్యంగా వెంటనే మూత్ర విసర్జన చేయకపోవడం, సబ్బుతో జననాంగాలను శుభ్రం చేయకపోవడం, బిగుతు లోదుస్తులు ధరించడం మానుకోవాలి. ఇవి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పరిశుభ్రత, ఆరోగ్యం కోసం జాగ్రత్తలు అవశ్యం.

     

    After Sex Telugu Tips
    After Sex Telugu Tips

     



  • Jul 14, 2025 11:00 IST

    Amalapuram : వైసీపీ వచ్చాక నీ అంతు చూస్తా.. సీఐకి మాజీ మంత్రి వార్నింగ్

    అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ కు మాజీ మంత్రి, వైసీపీ నేత విశ్వరూప్ వార్నింగ్ ఇచ్చారు.  వైసీపీ  కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి రూరల్ సీఐ వేధిస్తు్న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    viswarup



  • Jul 14, 2025 10:31 IST

    Rangam Bhavishyavani: రక్తం కక్కుకొని చస్తారు.. బోనాలు రంగంలో అమ్మవారు ఉగ్రరూపం

    సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం జరుగుతోంది. బోనాల జాతరలో రెండోరోజు జరిగే ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

    RAMGAM



  • Jul 14, 2025 10:30 IST

    BIG BREAKING: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి మృతి

    ప్రముఖ నటి బి.సరోజాదేవి మృతి చెందారు. గతకొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. తాజాగా కన్ను మూశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో నటించిన సరోజాదేవి.. దాదాపు 180కి పైగా సినిమాలు చేశారు. ఆమెకు 2009లో పద్మభూషణ అవార్డుతో కేంద్ర సత్కరించింది.

     

    actress B.Saroja Devi passed away due to health issues
    actress B.Saroja Devi passed away due to health issues

     



  • Jul 14, 2025 10:30 IST

    Stunt Master Live Video: గాల్లో లేచిన కారు.. స్టంట్ మాస్ట‌ర్ లైవ్ డెడ్ - సంచలన వీడియో

    తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సెట్‌లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం కార్ స్టంట్ చేస్తుండగా జూలై 13న ఈ దుర్ఘటన జరిగింది.

     

    Stunt Master Live Video
    Stunt Master Live Video

     



  • Jul 14, 2025 10:29 IST

    AP CRIME: ఓరి పాపిస్టోడా.. ట్రాక్టర్‌ను అలా ఎలా ఎత్తుకెళ్లావ్ రా - ఏపీలో షాకింగ్ ఇన్సిడెంట్

    ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ట్రాక్టర్‌ను కంటైనర్‌లో ఎత్తుకెళ్లారు. జూలై 8న పార్క్ చేసిన ట్రాక్టర్ మరుసటి రోజు కనిపించకపోవడంతో యజమాని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

     

    Tractor stolen in Bhawanipuram, NTR district
    Tractor stolen in Bhawanipuram NTR district

     



  • Jul 14, 2025 09:21 IST

    Early Morning Tips: ఉదయం లేవగానే ఇలా చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి!

    రోజూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయం మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అది మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండాలంటే ఉదయం కొన్ని అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

     

    Early Morning Tips
    Early Morning Tips

     



  • Jul 14, 2025 09:20 IST

    ఆ యాంగిల్‌లో రన్నింగ్ బైక్‌పై రెచ్చిపోయిన ప్రేమ జంట (VIDEO)

    రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు. అది మరో బైక్‌పై ప్రయాణిస్తున్న వారి వీడియో తీశారు. వీడియోలో యువతి, బైక్ నడుపుతున్న వ్యక్తిని కౌగిలించుకొని కూర్చింది. ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌ మీద ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

    lovers running bike



  • Jul 14, 2025 09:19 IST

    MLC తీన్మార్ మల్లన్న, కవితపై పోలీస్ కేసు నమోదు

    MLC తీన్మార్ మల్లన్న, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై కేసు నమోదైంది. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

    1256322131



  • Jul 14, 2025 09:18 IST

    New Ration Cards: 11ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

    తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. 11ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది రేవంత్ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.

    new ration card



  • Jul 14, 2025 07:58 IST

    IND vs ENG : గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం.. ఇండియాను ఓడిస్తాం : ఇంగ్లాండ్‌ కోచ్ సవాల్

    ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఇండియాను సవాల్ చేశారు.   ఐదు రోజు మొదటి గంటలోనే మేము ఆరు వికెట్లు తీసి ఇండియాను ఓడిస్తామన్నారు. తమ బౌలర్లు తొలి గంటలోనే భారత్‌ను ఆలౌట్‌ చేస్తారని,  సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతామని కామెంట్స్ చేశాడు.  

    ind-vs-eng



  • Jul 14, 2025 07:44 IST

    TG Crime : వాయిస్‌ ఛేంజర్‌ మిషన్‌తో ఆడగొంతుగా మాట్లాడి.. సర్వేయర్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

    ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వర్‌ని వివాహం చేసుకుంది.

    murder



  • Jul 14, 2025 07:43 IST

    BIG BREAKING: టేకాఫ్ అయిన క్షణాల్లోనే మరో విమానం బ్లాస్ట్

    అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం మరవక ముందే మరో ఫ్లైట్ క్రాష్ అయ్యింది. లండన్‌ ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే విమానం బ్లాస్ట్ అయ్యింది. సౌత్‌ ఎండ్‌ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు సంభవించింది. టేకాఫ్‌ అయిన వెంటనే విమానం కుప్పకూలిపోయింది.

    Plane crash



  • Jul 14, 2025 07:43 IST

    Model San Rachel Died: షాకింగ్ న్యూస్.. మిస్‌ వరల్డ్‌ బ్లాక్ బ్యూటీ సాన్ రాచెల్ సూసైడ్..

    పుదుచ్చేరి మోడల్ సాన్ రాచెల్ (25) ఆత్మహత్య తీవ్ర విషాదం నింపింది. "బ్లాక్ బ్యూటీ" విభాగంలో "మిస్ వరల్డ్" టైటిల్ గెలుచుకున్న ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

     

    model san rachel from puducherry commits suicide
    model san rachel from puducherry commits suicide

     



  • Jul 14, 2025 07:02 IST

    Girl Suicide: ‘నా జీవితం నాకు అసహ్యంగా మారింది’.. 6 రోజులుగా మిస్సింగ్.. చివరికి..

    ఆరు రోజులుగా అదృశ్యమైన త్రిపురకు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహా దేబ్‌నాథ్ (19) మృతదేహం ఆదివారం యమునా నదిలో లభ్యమైంది. ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య లేఖ కూడా దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

     

    Missing Delhi University student found dead in Yamuna River after 6 days
    Missing Delhi University student found dead in Yamuna River after 6 days

     



  • Jul 14, 2025 07:02 IST

    Annamayya Lorry Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

    అన్నమయ్య జిల్లాలో రెడ్డిపల్లె గ్రామంలోని చెరువు కట్టపై లారీ బోల్తా పడిన విషాద ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రగాయాలు పాలైయ్యారు. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

    annaayya lorry accident



  • Jul 14, 2025 06:56 IST

    Director Rajamouli : ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!

    దర్శకుడు రాజామౌళి కూడా అక్కడికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఓ అభిమాని ఆయనతో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. కారు వరకు ఫాలో అయ్యాడు.  దీంతో కోపంతో రాజమౌళి అభిమానిని తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    50ae20dd-5e41-4ac2-b911-7ae7431726e8



Advertisment
Advertisment
తాజా కథనాలు