/rtv/media/media_files/2025/07/14/famous-celebrity-divorces-2025-07-14-12-15-19.jpg)
Famous Celebrity Divorces
Famous Celebrity Divorces: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్లు(Saina Nehwal Divorce) జూలై 13న అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో విడాకులు తీసుకున్న మరికొందరు ప్రముఖుల వివరాలు ఇప్పుడు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ, క్రీడా, సంగీత రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు గత ఏడాది, ఈ ఏడాది విడాకులను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.
Also Read: ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
Famous Celebrity Divorces
హార్దిక్ పాండ్యా - నటాషా స్టాంకోవిచ్ (క్రికెటర్ - నటి): టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో నాలుగేళ్ల బంధానికి స్వస్తి పలికినట్లు ప్రకటించారు. 2020లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2024లో విడిపోయారు.
ఏఆర్ రెహమాన్ - సైరా బాను (సంగీత దర్శకుడు): ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బానుతో 29 సంవత్సరాల సుదీర్ఘ దాంపత్య బంధానికి 2024లో ముగింపు పలికారు. ఈ వార్త సంగీత ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
సానియా మీర్జా - షోయబ్ మాలిక్ (క్రీడాకారిణి - క్రికెటర్): క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విడాకులలో ఇది ఒకటి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 14 సంవత్సరాల వివాహ బంధానికి 2024 జనవరిలో స్వస్తి పలికారు. ఈ విడాకుల తర్వాత షోయబ్ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు.
ఇషా డియోల్ - భరత్ తఖ్తానీ (నటి): బాలీవుడ్ నటి, హేమమాలిని కుమార్తె ఇషా డియోల్ తన భర్త భరత్ తఖ్తానీ నుంచి 11 సంవత్సరాల వివాహం తర్వాత 2024 ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ - సైంధవి (సంగీత దర్శకుడు - గాయని): కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, గాయని సైంధవి 11 ఏళ్ల వైవాహిక బంధానికి 2024లో స్వస్తి పలికారు.
జయం రవి - ఆర్తి రవి (నటుడు): తమిళ స్టార్ హీరో జయం రవి, తన భార్య ఆర్తి రవితో 15 సంవత్సరాల వివాహ బంధానికి 2024లో ముగింపు పలికారు. ఈ వార్త కూడా అభిమానులను షాక్‌కు గురిచేసింది.