/rtv/media/media_files/2025/07/14/saina-nehwal-2025-07-14-06-17-07.jpg)
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా ఆమె తన సోషల్ మీడియాలో వెల్లడించారు. 35 ఏళ్ల భారత సీనియర్ స్టార్ సైనా జూలై 13 ఆదివారం అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. చాలా ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె తెలిపారు.
India’s star shuttlers Saina Nehwal and Parupalli Kashyap announce separation after 7 years of marriage pic.twitter.com/ttZKcfagez
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 13, 2025
"జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన, చర్చల తర్వాత, కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము మా శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాము" అని సైనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాల్సిందిగా కోరారు.
2018లో ప్రేమించి పెళ్లి
కాగా వీరిద్దరూ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలుసుకున్నారు, అక్కడ ఇద్దరూ లెజెండరీ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు. ఇక్కడే వారిద్దరి ప్రేమకథ ప్రారంభమైంది. అయితే వారి విడిపోవడానికి అసలు కారణం ఇంకా తెలియకపోయినా, కశ్యప్‌తో గడిపిన క్షణాలకు సైనా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
సైనా తన ఒలింపిక్ కాంస్య పతకం, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్‌తో ప్రపంచ ఐకాన్‌గా మారారు. కరణం మల్లేశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ ఆమె. 2015లో, సైనా మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. సైనా చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఆడింది.
ఇక కశ్యప్ ప్రపంచ టాప్ 10లోకి ప్రవేశించి 2014 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాన్ని సాధించాడు. 2024 ప్రారంభంలో తన క్రీడా జీవితాన్ని ముగించినప్పటి నుండి కశ్యప్ కోచింగ్‌ను ప్రారంభించాడు.