/rtv/media/media_files/2025/07/14/sperm-count-2025-07-14-12-17-43.jpg)
Sperm Count Tips
Sperm Count Tips: సంతాన సమస్యలు (Infertility) అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దంపతులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సుమారు 15% జంటలు సంతానలేమితో బాధపడుతున్నారు. ఇది స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ సమస్యల వల్ల కలగవచ్చు. అయితే పురుషులలో సంతానలేమికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం. స్పెర్మ్ కణాలు(Sperm Cells) అండం వైపు కదలలేకపోవడం, అసాధారణ ఆకృతి గల స్పెర్మ్ కణాలు, అసలు శుక్రకణాలు లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
Also Read: ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
ధూమపానం, మద్యపానం, డగ్స్ వినియోగం, ఊబకాయం, అధిక ఒత్తిడి, అధిక వేడికి వృషణాలు గురికావడం (ఉదాహరణకు ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం, వేడి నీటి స్నానాలు) కావడం వలన స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది(Sperm Count Test). అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గితే ఏదో అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఎలాంటి టాబ్లెట్లు లేకుండానే స్పెర్మ్ కౌంట్ సంఖ్యను పెంచుకోవచ్చు.
Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం(Nutrient Rich Food):
జింక్ అధికంగా ఉండే ఆహారాలు: ఇవి టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి స్పెర్మ్ నాణ్యతకు చాలా ముఖ్యం. గుమ్మడి గింజలు, చిక్కుళ్ళు, నట్స్, గుడ్లు, మాంసం వంటివి తీసుకోండి.
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు: ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి స్పెర్మ్ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. నారింజ, జామకాయ, బ్రోకలీ, బెర్రీలు, క్యాప్సికమ్ వంటివి తీసుకోండి.
ఫోలేట్ (విటమిన్ B9): ఇది DNA ఉత్పత్తికి, స్పెర్మ్ నిర్మాణానికి అవసరం. ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, బీన్స్, సిట్రస్ పండ్లు ( నారింజ) తీసుకోండి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: ఇవి స్పెర్మ్ ఆరోగ్యానికి, చలనశీలతకు ముఖ్యమైనవి. సాల్మన్, మాకెరెల్ వంటి కొవ్వు చేపలు, వాల్‌నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు తీసుకోండి.
విటమిన్ డి: టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. గుడ్లు, పుట్టగొడుగులు, సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు.
యాంటీఆక్సిడెంట్లు: డార్క్ చాక్లెట్, గ్రీన్ టీ, నట్స్, గింజలు, పండ్లు, కూరగాయలు వీటిని అందిస్తాయి.
వీటితో పాటుగా రోజుకు 7-9 గంటల నిద్ర చాలా ముఖ్యం. బిగుతుగా ఉండే లోదుస్తులకు బదులుగా వదులుగా ఉండేవి ధరించండి. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఇక జీవనశైలిలో మార్పుల విషయానికి వస్తే ప్రతిరోజూ పొద్దున టిఫిన్ చేయడం కంటే బదులుగా మొలకెత్తిన విత్తనాలు (Sprouts) తినండి. జీవమున్న మొలకలు బతుకున్న సెర్మ్ కౌంట్ ను పెంచుతాయి. ఆ తరువాత ఓ గంటసేపు గ్యాప్ ఇచ్చి ఏదైనా ఓ పండు లేదా కూరగాయ జ్యూస్ ను తాగండి. మళ్లీ మధ్యాహ్నం అన్నం తినేయండి. రాత్రికి అన్నం బదులుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ నాలుగు రకాలు పెట్టుకుని తినండి. వీటితో పాటుగా పండ్లను తినండి. ముఖ్యంగా దానిమ్మ జ్యూస్ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి బాగా సహయపడుతోంది. ఇలా ఓ మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే స్పెర్మ్ కౌంట్ లో తేడాలను గమనించవచ్చు. స్పెర్మ్ కౌంట్ రిఫ్రెష్ కు 70 నుంచి 80 రోజుల సమయం పడుతుంది. డాక్టర్లు వద్దకు వెళ్లకుండానే స్పెర్మ్ కౌంట్ పెరుగుదలను గమనించవచ్చు.