/rtv/media/media_files/2025/07/14/russia-to-import-1-million-skilled-workforce-from-india-2025-07-14-20-27-20.jpg)
Russia to import 1 million skilled workforce from India
రష్యాలో పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక శక్తి కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు ఆ దేశం భారత్‌పై ఫోకస్ పెట్టింది. 2025 చివరి నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులకు రష్యా ఉపాధి కల్పించనున్నట్లు సమాచారం. అక్కడ యాకటెరిన్‌బర్గ్‌లో ఓ కొత్త కాన్సులేట్ జనరల్ ప్రారంభం కానుంది. ఇది వలస కార్మికుల అంశాలను పరిశీలించనుంది. ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
Also Read: అన్‌డాకింగ్ సక్సెస్‌ఫుల్.. మరికొన్ని గంటల్లో భూమిపైకి శుభాంశు బృందం
Russia Bumper Offer To India
ఇది వలస కార్మికుల అంశాలను పరిశీలించనుంది. ఈ విషయాన్ని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. రష్యాలోని ఉరల్ పర్వతాలకు సమీపంలో యాకటెరిన్‌బర్గ్ ప్రాంతం అనేది భారీ పరిశ్రమలకు నిలయంగా ఉంది. అక్కడ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. అయితే ఈ ఇండస్ట్రీలు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉన్నట్లు అండ్రీ బెసెడిన్ తెలిపారు.
Also Read: వామ్మో హెయిర్ కట్‌కి ఇన్ని డబ్బులా.. ఈ దేశంలోనే కాస్ట్ ఎక్కువ?
భారత్‌తో పాటు శ్రీలంక, ఉత్తర కొరియా నుంచి కార్మికులను రప్పించేందుకు కూడా రష్యా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ ప్రక్రియలో పలు సమస్యలు ఉన్నట్లు భావిస్తోంది. 2024 నుంచి రష్యా పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేందుకు భారత్ నుంచి వలస వలస కార్మికులు రావడం మొదలైంది. అయితే రష్యా కార్మిక శాఖ అంచనాల ప్రకారం చూసుకుంటే 2030 నాటికి ఆ దేశంలో కార్మిక శక్తి కొరత 30 లక్షలకు పైగా ఉండనుంది. అందుకే దీన్ని అధిగమించేందుకు విదేశీ కార్మికులకు ఆఫర్ ప్రకటించింది.
Also Read: మోదీపై అభ్యంతరకర కార్టూన్.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
jobs | india | russia | rtv-news | telugu-news