Nagpur: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

నాగ్‌పూర్‌లో ఆత్రే లేఅవుట్‌లో నివసించే 74 ఏళ్ల జయంత్ నారాయణ్ కావ్రే స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతి చెందాడు. ఈత కొడుతుండగా అకస్మాత్తుగా నీటిలో గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Swimming pool

Swimming pool

నాగ్‌పూర్‌లో ఆత్రే లేఅవుట్‌లో నివసించే 74 ఏళ్ల జయంత్ నారాయణ్ కావ్రే స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతి చెందాడు. నాగ్‌పూర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ (NIT) నిర్వహిస్తున్న నార్త్ అంబజారి రోడ్‌లోని స్విమ్మింగ్ పూల్‌కు ఎప్పటిలాగే ఈత కొట్టడానికి వెళ్లాడు. కానీ ఈత కొడుతుండగా అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. మార్గ మధ్యంలోనే ఆ వ్యక్తి మృతి చెందాడు. అయితే కావ్రే గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నప్పుడు అకస్మా్త్తుగా గుండెపోటు రావడంతో మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!

షార్ట్ సర్క్యూట్ వల్ల

ఇదిలా ఉండగా ఇటీవల నారాయణపేట జిల్లా ముక్తల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. నందినినగర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే.. మృతి చెందిన బాలికకు కళ్లు కనిపించవు. మతిస్థిమితం లేదు. ఆమె తల్లిదండ్రులు రోజూవారి కూలీలు. 

ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

ఎప్పట్లాగే పనులు నిమిత్తం బయటకు వెళ్లారు. దీంతో కళ్లు కనిపించని ఆ బాలిక వంటగదిలోకి వెళ్లింది. పొరపాటున అక్కడ ఉన్న ప్లగ్‌ వైర్లను లాగింది. ఈ క్రమంలోనే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. ఆ బాలికకు కళ్లు కనిపించకపోవడం, మతిస్థిమితం లేకపోవడం వల్ల తప్పించుకోలేక పోయింది.

ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

చివరికీ అక్కడే సజీవ దహనమైంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని మక్తల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు