/rtv/media/media_files/2025/07/14/ind-vs-eng-2025-07-14-07-55-18.jpg)
లార్డ్స్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటను 58/4తో ముగించిన టీమిండియా.. విజయానికి ఇంకా 135 పరుగుల దూరంలో ఉంది. కేవలం టీమిండియా చేతిలో ఆరు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కెఎల్ రాహుల్ 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఇండియాను సవాల్ చేశారు. ఐదు రోజు మొదటి గంటలోనే మేము ఆరు వికెట్లు తీసి ఇండియాను ఓడిస్తామన్నారు. తమ బౌలర్లు తొలి గంటలోనే భారత్‌ను ఆలౌట్ చేస్తారని, సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతామని కామెంట్స్ చేశాడు.
VIDEO | India vs England, 3rd Test: Speaking at a press conference following day 4 at Lord's, England assistant coach Marcus Trescothick says, "If I knew that, I could probably relax a bit coming into tomorrow, but of course we are desperate to win, but it is going to be amazing.… pic.twitter.com/oHsxfkXeqX
— Press Trust of India (@PTI_News) July 13, 2025
జామీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి
193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకముందే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ జామీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్ రెండో వికెట్‌కు 36 పరుగులు జోడించారు. కరుణ్ నాయర్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి బెన్ కార్సే బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మొత్తం సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లలో అర్ధ సెంచరీ చేయని ఏకైక టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు.
కరుణ్ నాయర్ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్ కేవలం 9 బంతుల్లో 6 పరుగులు చేసి కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాష్ దీప్ కూడా తన వికెట్‌ను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. బెన్ స్టోక్స్ 11 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌటైంది.వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.