Kota Srinivasa Rao: విలక్షణ నటుడు కోటశ్రీనివాస రావు మృతితో సినీ ప్రపంచానికి తీరని లోటు. తెలుగు సినీ చరిత్రలో ఆయనది ఒక చెరగని అధ్యాయం. 4 దశాబ్దాల సినీ కెరీర్లో 700 పైగా సినిమాల్లో ఆయన వేసిన ప్రతీ వేషం, చేసిన ప్రతీ పాత్ర ప్రత్యేకమే! అల్లరి తాతయ్యగా, కరుడుగట్టిన మావయ్యగా, మధ్యతరగతి తండ్రిగా, క్రమశిక్షణ గల ఇంటి పెద్దగా కోట నటన మరుపురానిది! మొదట్లో యాక్టింగ్ కెరీర్ ని పెద్దగా సీరియస్ తీసుకోకపోయినా.. ఆ తర్వాత నటనే తన జీవితంగా బ్రతికారు. మరణానంతరం కూడా తన నటనతో ప్రేక్షకుల మదిలో బ్రతకాలనుకున్నారు కోట!
Also Read: Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?
అదే కోట ఆశయం!
"చనిపోయే దాకా నటించాలి... చనిపోయిన తర్వాత నటుడిగా బతకాలి" అనేదే తన జీవిత ఆశయం అని చెప్పారు కోట. ఈ మాట ఆయనకు నటన పట్ల ఉన్న అంతులేని ప్రేమకు, అంకితభావానికి నిదర్శనం! చివరిరోజుల్లో కూడా నటించాలనే ఆయన తపన అనంతం. ఆయన చెప్పినట్లుగానే ఈరోజు కోట మన మధ్య భౌతికంగా లేకపోయినా.. ఆయన నటన ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఆయన వేసిన పాత్రలు, పలికిన డైలాగులు ఇప్పటికీ , ఎప్పటికీ ప్రేక్షకుల కళ్ళ ముందు మెరుస్తూనే ఉంటాయి. వందల చిత్రాల్లో కోట వేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
'ఆ నలుగురిలో' కోటయ్య, 'అహ నా పెళ్లంట' సినిమాలో పిసినారి లక్ష్మీపతి, 'గణేష్'లో సాంబశివుడు, 'గాయం' లో గురునారాయణ, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో గణేష్ తండ్రిగా కోట నటన మరుపురానిది.
Also Read : పుట్టినరోజు జరుపుకున్న 3 రోజులకే.. కోట మరణంపై కన్నీరు పెట్టిస్తున్న కుటుంబ సభ్యుల మాటలు!