Wimbledon 2025: అల్కరాజ్‌‌ను ఓడించి.. వింబుల్డన్‌ కొత్త ఛాంపియన్‌గా సినర్‌

ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ స్టార్ జానిక్ సినర్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌ను 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించాడు. దీంతో సినర్ తన మొదట వింబుల్డన్ గెలుచుకున్నాడు.

New Update
Jannik Sinner

Jannik Sinner

ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ స్టార్ జానిక్ సినర్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ సినర్, డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌ను 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించాడు. ఈ విజయంతో సినర్ తన మొదటి వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌‌ఫోన్.. కెమెరా సూపరెహే!

ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

ప్రతీకారం తీర్చుకున్న సినర్..

గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి సినర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్ దాదాపు మూడు గంటల నాలుగు నిమిషాల పాటు జరిగింది. తొలి సెట్‌లో అల్కరాజ్ విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత సినర్ అద్భుతంగా పుంజుకుని వరుసగా మూడు సెట్‌లు గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

ఈ ఓటమితో అల్కరాజ్ వరుసగా మూడు వింబుల్డన్ టైటిల్స్ గెలవాలనే ఆశలు గల్లంతయ్యాయి. విజేతగా నిలిచిన సినర్‌కు దాదాపు రూ. 34 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన అల్కరాజ్‌కు రూ.17.65 కోట్లు లభించాయి. 

ఇది కూడా చూడండి:Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ ఓవరాక్షన్.. ఐసీసీ సంచలన నిర్ణయం!

Wimbledon 2025

Advertisment
Advertisment
తాజా కథనాలు