Stunt Master Live Video: గాల్లో లేచిన కారు.. స్టంట్ మాస్ట‌ర్ లైవ్ డెడ్ - సంచలన వీడియో

తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సెట్‌లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం కార్ స్టంట్ చేస్తుండగా జూలై 13న ఈ దుర్ఘటన జరిగింది.

New Update
Stunt Master Live Video

Stunt Master Live Video

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి స్టంట్స్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న రాజు జూలై 13 (ఆదివారం) ఉదయం జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో కార్ స్టంట్ చేశాడు. ఆ సమయంలో ఊహించని ప్రమాదంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

Also Readఏరా బుద్దుందా..  అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!

Stunt master Raju died

ఈ వార్తతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, హీరోలు రాజు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. హీరో విశాల్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ అయ్యారు. 

Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

ఇందులో భాగంగా విశాల్ తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. సినిమా షూటింగ్‌లో కార్ స్టంట్ చేస్తూ మాస్టర్ రాజు మృతి చెందాడన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. రాజు ఇక లేడనేది జీర్ణించుకోలేకపోతున్నాను. అతను నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నేను నటించిన ఎన్నో చిత్రాలకు రాజు స్టంట్ మాస్టర్‌గా వర్క్ చేశాడు. అలాంటి రాజు ఇక మన మధ్య లేడన్న విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అని పేర్కొన్నారు. 

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

ఫైట్ మాస్టర్ సిల్వ స్టంట్ కూడా రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయాం అన్నారు. స్టంట్ యూనియన్, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు అని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు