/rtv/media/media_files/2025/07/14/50ae20dd-5e41-4ac2-b911-7ae7431726e8-2025-07-14-06-48-53.jpeg)
Director Rajamouli: అభిమానులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఎక్కడ ఏం చేస్తున్నామో కనీస సోయి లేకుండా బీహెవ్ చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని చేసిన పని దర్శకుడు రాజామౌళి(SS Rajamouli)కి చిర్రెత్తుకొచ్చింది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు సినీ ప్రముఖులు(Tollywood) సంతాపం తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో దర్శకుడు రాజామౌళి కూడా అక్కడికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఓ అభిమాని ఆయనతో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. కారు వరకు ఫాలో అయ్యాడు. దీంతో కోపంతో రాజమౌళి అభిమానిని తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అ అభిమానిని చివాట్లు పెడుతున్నారు. ఏరా బుద్దుందా ఎక్కడ ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా.. వచ్చిన సందర్భం ఏంటో తెలుసుకోకుండా సెల్ఫీ కోసం ఎగబడడం ఏంటని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెన్స్ ఉందా అంటూ ఉతికారేస్తున్నారు.
Also Read:ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు
కోట శ్రీనివాసరావు 2025 జూలై 13, ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు అదే మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరిగాయి. ఆయన అంతిమయాత్ర మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 నుంచి 3:30 గంటల సమయంలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మనవడు శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, బ్రహ్మానందం, నారా చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు.
Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి