/rtv/media/media_files/2025/07/14/train-2025-07-14-14-59-38.jpg)
Train
ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారుల అజాగ్రత్త వల్ల లేకపోతే రైలులో ప్రయాణికులు చేసిన మిస్టేక్స్ వల్ల భోగీలో మంటలు ఎక్కువగా చెలరేగుతున్నాయి. ఆదివారం చెన్నైలో గూడ్స్ రైలులో ప్రమాదం జరగ్గా, తాజాగా తిరుపతి రైలులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా రెండు భోగీల్లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధం అయ్యాయి. రాయలసీమ, షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లు ఆగి ఉండటంతో ఒక్కసారిగా రెండు రైళ్లలోని భోగీల్లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
🚨Breaking News 🚨
— Telugu Feed (@Telugufeedsite) July 14, 2025
తిరుపతిలో రైలు ప్రమాదం
హిస్సార్ టు తిరుపతి (04717) ట్రైన్లో చాలా చెలరేగిన మంటలు
రెండు బోగీలు దగ్ధం, సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు, రెండు బోగీలు దగ్ధం#FireAccident#Tirupati#Trainpic.twitter.com/2BHtU7XSeW
ఇది కూడా చూడండి: Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
చెన్నైలో ఇటీవల రైలు ప్రమాదం..
ఇదిలా ఉండగా ఇటీవల చెన్నైలో దారుణమైన ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. తిరువళ్లూరు సమీపంలో ఇంధనంతో వెళ్తున్న గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోర్టు నుంచి చమురుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన కారణంగా తిరువళ్లూరు గుండా వెళ్లే అన్ని రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చూడండి: Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
మరోవైపు రైలు నుంచి దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదీగాక ఆ రైలులో చమురు అధికంగా ఉండటం వల్ల మరిన్ని బోగీలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ ఓవరాక్షన్.. ఐసీసీ సంచలన నిర్ణయం!
ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో అదుపు చేసేందుకు కష్టంగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
tirupathi | train-accident | latest telugu news updates | telugu-news