/rtv/media/media_files/2025/07/14/tractor-stolen-in-bhawanipuram-ntr-district-2025-07-14-09-42-47.jpg)
Tractor stolen in Bhawanipuram NTR district
అతడు ఒక దొంగ. ఎంత పెద్ద దొంగ అంటే ఒక ట్రాక్టర్‌నే ఎత్తుకెళ్లేంత గజదొంగ. అయితే ఈ దొంగతనాన్ని అతడు ట్రాక్టర్ కీను ఉపయోగించి చేయలేదు. ఏకంగా కంటెయినర్‌లో ఎక్కించి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. ఇది మరెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
ట్రాక్టర్ చోరీ
ఈ నెల అంటే జూలై 9వ తేదీ రాత్రి ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో ఒక ట్రాక్టర్ చోరీకి గురైంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన ప్లేస్ నుంచి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ సమయంలో వారికి షాకింగ్ విజువల్స్ బయటపడ్డాయి.
Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
ఆ దొంగ ట్రాక్టర్‌ను కంటెయినర్‌లోకి ఎక్కించి ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆ కంటెయినర్ వెళ్లిన మార్గంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. మొత్తంగా ఆ కంటెయినర్ ఎక్కడికి వెళ్లిందో కనుక్కున్నారు. అది శ్రీ సత్యసాయి జిల్లా కియా ఇండస్ట్రియల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి
అనంతరం ఆ ప్రాంతానికి వెళ్లి కంటెయినర్‌తో పాటు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై నిందితుడిని అరెస్టు చేశారు. ఆ నిందితుడు రాజస్థాన్‌కు చెందిన రాజీవ్‌సింగ్ పరమార్‌గా గుర్తించారు. ఈ ఘటనతో భవానీపురం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.