Amalapuram : వైసీపీ వచ్చాక నీ అంతు చూస్తా.. సీఐకి మాజీ మంత్రి వార్నింగ్

అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ కు మాజీ మంత్రి, వైసీపీ నేత విశ్వరూప్ వార్నింగ్ ఇచ్చారు.  వైసీపీ  కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి రూరల్ సీఐ వేధిస్తు్న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
viswarup

అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ కు మాజీ మంత్రి, వైసీపీ నేత విశ్వరూప్ వార్నింగ్ ఇచ్చారు.  వైసీపీ  కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి రూరల్ సీఐ వేధిస్తు్న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలంటూ సీఐకి విశ్వరూప్ హెచ్చరించారు. నిన్ను జైల్లో పెట్టి ఊచలు లెక్కపెట్టిస్తా అంటూ విశ్వరూప్ రెచ్చిపోయారు.  వైసీపీ కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ ముందు దర్నా చేసేలా తెచ్చుకొవద్దన్నారు.  నిబంధనలకు దూరంగా ప్రవర్తించవద్దన్నారు విశ్వరూప్. అమలాపురంలో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.  ఇటీవల వైసీపీ అల్లవరం మండలం అధ్యక్షుడు బాపూజీ కుమారుడిపై అకారణంగా కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేయడంతో పాటు కొత్తపేట సబ్‌జైలుకు రిమాండ్‌కు పంపించారని విశ్వరూప్‌ ఆరోపించారు. 

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

Also Readఏరా బుద్దుందా..  అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!

పేర్ని నాని సంచలన సవాల్

ఇక కూటమి నేతలకు మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన సవాల్ చేశారు. ఎవడొస్తాడో రండి..  దమ్ముంటే కొడాలి నానిని కడ్‌ డ్రాయర్‌పై నడిపించండి చూద్దాం అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఇన్ని రోజులు అనారోగ్యంతో నాని గుడివాడలో యాక్టివ్‌గా లేరని ఇప్పుడు ఆరోగ్యం బాగు చేసుకొని మరో మూడు నెలల్లో గుడివాడలో అడుగుపెడుతున్నారని తెలిపారు. నాని అంతు చూస్తామన్నవారు చేసి చూపించాలన్నారు.  పెడనలో ఆదివారం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని ఇలాంటి కామెంట్స్ చేశారు.  నువ్వు 70 ఏళ్ల ముసలోడివవి .. ఇంకెత కాలం బతుకుతావ్..  50 ఏళ్ల జగన్ ను భూస్థాపితం చేయడం నీ తరమా.. నీ కొడుకు తరమా అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారు.

Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

Advertisment
తాజా కథనాలు