/rtv/media/media_files/2025/07/14/warangal-doctor-2025-07-14-17-45-38.jpg)
Warangal Doctor
పరస్త్రీ మోజులో పడి కట్టుకున్న భార్యను పట్టించుకోని ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఇటీవల వరంగల్‌లోనూ ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇక ఇన్ఫ్లూయెన్సర్‌పై ఉన్న మోజుతో తన భర్త తనని దూరం పెట్టాడని ప్రత్యూష అనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. హసన్‌పర్తిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగి ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రత్యూష భర్త సృజన్ వరంగల్ మెడికవర్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రత్యూష అక్కడ వేరే ఆసుపత్రిలో పనిచేస్తుంది. అయితే వీరికి కొన్నేళ్ల కిందట పెళ్లి కాగా ఇద్దరూ పిల్లలు ఉన్నారు.
ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
యువ డాక్టర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గర్ల్
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2025
హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన డాక్టర్ ప్రత్యూషను 2017లో పెళ్లి చేసుకున్న డాక్టర్ సృజన్.. వీరికి ఇద్దరు పిల్లలు
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే శృతి(బుట్ట బొమ్మ)తో ప్రేమలో పడ్డ కార్డియాలజీ డాక్టర్ సృజన్… pic.twitter.com/fbvorPyPzD
ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
ఇన్ఫ్లూయెన్సర్ మోజులో పడి..
పెళ్లి అయిన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ మధ్యలో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ మోజులో పడి సృజన్ తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఆ ఇన్ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటానని, విడాకులు ఇస్తానని ప్రత్యూషను బెదిరించేవాడు. ఎవరికైనా చెబితే ఇదే పని చేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో మానసిక ఆవేదన చెందిన ప్రత్యూష తీవ్రంగా ఒత్తిడికి గురైంది. చివరకు ఈ బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్‌కు, సృజన్‌కు ప్రమోషనల్ ఇంటర్వ్యూ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం క్లోజ్‌గా మారింది. ఈమె మాయలో పడిన సృజన్ భార్య, పిల్లలను పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరిగారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ యువతికి 2 లక్షల పైనే ఫాలోవర్స్ ఉన్నారు. బుట్టబొమ్మ పేరుతో సోషల్ మీడియాలో రీల్స్, ప్రమోషన్స్ చేస్తోంది. ఈమె వల్ల సృజన్ మారాడని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఇన్ఫ్లూయెన్సర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ప్రత్యూష తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
doctor | latest-telugu-news | latest telugu news updates | crime news