/rtv/media/media_files/2025/07/14/ycp-leader-dushyant-reddy-likely-to-join-tdp-2025-07-14-21-37-49.jpg)
YCP Leader Dushyant Reddy likely To Join TDP
ఏపీలోని పులివెందుల రాజకీయాలు మారుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ వైపు ఆయన కుటుంబ సభ్యులు ఉండటమే దీనికి కారణం. జగన్ సోదరుడు చెవ్వ దుష్యంత్ రెడ్డి ప్రస్తుతం టీడీపీకి టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీడీపీ కీలక నేతలతో దుష్యంత్ రెడ్డి భేటీ ఉంటుందని చర్చ నడుస్తోంది.
Also Read: ఎయిర్‌లైన్ సంస్థలకు బిగ్ అలెర్ట్.. DGCA సంచలన ఆదేశాలు
చెవ్వ విజయ శేఖర్ రెడ్డి కుమారుడే దుష్యంత్ రెడ్డి. దుష్యంత్ జగన్‌కు వరుసకు తమ్ముడు అవుతాడు. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తాము పూర్తిగా సహకరిస్తామని దుష్యంత్ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు జమ్మలమడుగులోని దుష్యంత్‌రెడ్డి మైనింగ్ వ్యవహారాలకు ప్రభుత్వం సాయం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: అన్‌డాకింగ్ సక్సెస్‌ఫుల్.. మరికొన్ని గంటల్లో భూమిపైకి శుభాంశు బృందం
ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ పంచాయితీలో దుష్యంత్‌కు పులివెందుల రూరల్ సీఐ రమణ.. దగ్గకుండి సాయం చేశారు. ఇప్పటివరకు దుష్యంత్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరించాడు. కానీ ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పులివెందులలో మారుతున్న ఈ రాజకీయాలు సంచలనం రేపుతున్నాయి.