/rtv/media/media_files/2025/07/14/model-san-rachel-from-puducherry-commits-suicide-2025-07-14-07-16-12.jpg)
Model San Rachel Died
Model San Rachel Died: పుదుచ్చేరికి చెందిన ప్రముఖ మోడల్ సాన్ రాచెల్ (25) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం (జూలై 13) అధిక మోతాదులో రక్తపోటు మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చర్మం రంగుతో సంబంధం లేకుండా తన ప్రతిభ కారణంగా మోడలింగ్ పరిశ్రమలో రాణించిన శంకర ప్రియ, అలియాస్ శాన్ రాచెల్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యల కారణంగా జిప్మర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
Model San Rachel Suicide..
పుదుచ్చేరిలోని కరమణి కుప్పంలో నివసించిన శాన్ రాచెల్ "బ్లాక్ బ్యూటీ" విభాగంలో "మిస్ వరల్డ్" టైటిల్ గెలుచుకున్నారు. 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, అదే ఏడాదిలో మిస్ బెస్ట్ యాటిట్యూడ్ టైటిల్,2020-21లో మిస్ పాండిచ్చేరి తదితర పలు టైటిల్స్‌ని గెలుపొందారు. ఫ్యాషన్ షోలు, ఇతర కార్యక్రమాలను హోస్ట్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రక్తపోటు మాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఆమెను వెంటనే జిప్మెర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఓరులాయన్ పేట్టై పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
సాన్ రాచెల్ ఆత్మహత్యకు గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్రధాన కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటిగా.. ఫ్యాషన్ షోలు నిర్వహించడంలో ఆమెకు భారీ ఆర్థిక నష్టాలు వాటిల్లినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ నష్టాలు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసి ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సాన్ రాచెల్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, చికిత్స పొందుతున్నారని మరికొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి
పోలీసులు ఆమె ఇంట్లో ఒక డెత్ నోట్ను కనుగొన్నట్లు సమాచారం. ఆ నోట్లో తన భర్త లేదా అత్తగారు తన మరణానికి కారణం కాదని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాన్ రాచెల్ మరణం మోడలింగ్ పరిశ్రమలో, ఆమె అభిమానులలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.