/rtv/media/media_files/2025/07/14/actress-saroja-devi-passed-away-due-to-health-issues-2025-07-14-10-24-14.jpeg)
actress B.Saroja Devi passed away due to health issues
ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బీ.సరోజా దేవి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, సోమవారం (జూలై 14) ఉదయం బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Also Read: ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
Saroja Devi passed away
తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో కలిపి 200లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలతో ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 'మంచి చెడు', 'దాగుడుమూతలు', 'పండంటి కాపురం', 'దాన వీర శూర కర్ణ' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.
Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
సరోజా దేవి మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని సమాచారం. కోట శ్రీనివాసరావు మృతి చెందిన విషాదం నుంచి పరిశ్రమ ఇంకా కోలుకోకముందే సరోజా దేవి మరణం మరోసారి సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తింది.
Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి