US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు బిగ్ షాక్.. US ఎంబసీ వార్నింగ్

USకు వెళ్లే భారతీయులకు మనదేశంలోని ఆ దేశ ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వీసా జారీ చేసిన తర్వాత కూడా తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది. US చట్టాలు, వలస నిబంధనలు ఉల్లంఘించేవారిపై వేటు తప్పదని హెచ్చరించింది.

New Update
US Embassy warning

అమెరికాకు వెళ్లే భారతీయులకు మనదేశంలోని యూఎస్ ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వలసదారులపై కఠిన వైఖరి అనుసరిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికా వీసా జారీ చేసిన తర్వాత కూడా తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది. వీసా మంజూరుతోనే స్క్రీనింగ్‌ ఆగిపోదు. వారి ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటాం. అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్‌ నిబంధనలను వలసదారులు తప్పనిసరిగా పాటించాల్సిందే. వాటిని అతిక్రమిస్తే మాత్రం ఏ క్షణమైనా వీసా రద్దు చేసి దేశం నుంచి వెళ్లగొడతామని ఎంబసీ తమ పోస్ట్‌లో స్పష్టంచేసింది.

US చట్టాలు, వలస నిబంధనలు ఉల్లంఘించేవారిపై వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. అలాంటి వారి వీసాలు రద్దు చేసి, స్వదేశానికి పంపిస్తామని పునరుద్ఘాటించింది. కాగా ఇప్పటికే అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం బలవంతంగా స్వదేశాలకు పంపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీసాల జారీకి సోషల్‌ మీడియా వెట్టింగ్‌ను తప్పనిసరి చేసింది. 

Advertisment
తాజా కథనాలు