ENG vs IND: లార్డ్స్‌లో ఛేజింగ్ ఖాయమే.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమిండియా మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ వేదికలో భారత్ చివరిగా 1986లో విజయం సాధించింది. ఆ తర్వాత 1990, 2002లో భారత్ ఓటమి పాలైంది. ఈసారి ఇంగ్లాండ్ ఇచ్చిన 193 పరుగులు లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందో లేదో చూడాలి.

New Update
Team India captain Shubman Gill scored a century in the second Test in England

Team India

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమిండియా మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ స్టేడియంలో టీమిండియా విజయం సాధించాలంటే 135 పరుగులు అవసరం. లార్డ్స్ వేదికలో భారత్ చివరిగా 1986లో విజయం సాధించింది. అప్పుడు 133 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో రవిశాస్త్రి, మహ్మద్ అజహరుద్దీన్ కీలక ఇన్నింగ్స్ ఆడగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కపిల్ దేవ్ నిలిచాడు.

ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌‌ఫోన్.. కెమెరా సూపరెహే!

బౌలింగ్ పిచ్..

ఈ మ్యాచ్ తర్వాత 1990, 2002లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ రెండు సార్లు కూడా ఎక్కువ టార్గెట్ ఎక్కువే. ఈ లార్డ్స్ పిచ్ బ్యాటింగ్ కంటే బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లార్డ్స్ వేదికగానే జరిగింది. ఇందులో ఆస్ట్ట్రేలియా జట్టు 282 పరుగలు చేసి దక్షిణాఫ్రికాకు టార్గెట్ పెట్టింది.

ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్య ఛేదనను సాధించింది. ఇప్పుడు కూడా భారత్ మ్యాచ్ గెలవాలంటే 135 పరుగులు చేయాలి. ఇది టీమిండియాకు పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్దగా స్కోర్ కొట్టకపోయినా కూడా ఔట్ కాకుండా క్రీజులో ఉండటం ముఖ్యం. కేఎల్ రాహుల్‌తో పాటు ఇంకా నలుగురు బ్యాటర్లు ఆడితేనే భారత్ గెలిచే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

ఇంగ్లాండ్‌పై విండీస్ 1984లో 344/1, న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ 2004లో 282/3, ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 2025లో 282/5, న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ 2022లో 279/5.. 1965లో 218/3, విండీస్‌పై ఇంగ్లాండ్ 2012లో 193/5.. 2000లో 191/8 లతొ విజయాలు సాధించాయి.

ఇది కూడా చూడండి:Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ ఓవరాక్షన్.. ఐసీసీ సంచలన నిర్ణయం!

teamindia | england | lords cricket

Advertisment
Advertisment
తాజా కథనాలు