BIG BREAKING: గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు

టీడీపీ సీనియన్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మూడు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది.

New Update
Ashok Gajapathi Raju

టీడీపీ సీనియన్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మొత్తం మూడు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. హర్యానా అషింకుమార్, లద్దాఖ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాను నియమితులయ్యారు. 

Also Read :  అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌‌ఫోన్.. కెమెరా సూపరెహే!

Also Read :  ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

టీడీపీలో అత్యంత సీనియర్ నేత..

విజయనగరానికి చెందిన అశోక్ గజపతిరాజు టీడీపీ లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. చంద్రబాబు, ఆయన ఇద్దరూ ఒకే సారి రాజకీయాల్లో ప్రవేశించారు. దశాబ్ధాల పాటు జిల్లా రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. అయితే.. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. అప్పటి నుంచి గవర్నర్ గా ఆయనకు అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తు ఉండడం, ప్రభుత్వంలోనూ టీడీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులతో పాటు ఇప్పుడు గవర్నర్ పదవి కూడా లభించినట్లు తెలుస్తోంది. 

Also Read :  మహమ్మద్ సిరాజ్ ఓవరాక్షన్.. ఐసీసీ సంచలన నిర్ణయం!

Also Read :  మరోసారి నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి - ఆరు జిల్లాలకు హైఅలెర్ట్

latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు