Sexual After care Tips: సె*క్స్ తర్వాత ఈ పనులు ఖచ్చితంగా చెయ్యాలి.. లేదంటే చాలా డేంజర్!

శృంగారం తర్వాత కొన్ని పనులు చేయకూడదు. ముఖ్యంగా వెంటనే మూత్ర విసర్జన చేయకపోవడం, సబ్బుతో జననాంగాలను శుభ్రం చేయకపోవడం, బిగుతు లోదుస్తులు ధరించడం మానుకోవాలి. ఇవి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పరిశుభ్రత, ఆరోగ్యం కోసం జాగ్రత్తలు అవశ్యం.

New Update
After Sex Telugu Tips

After Sex Telugu Tips

శృంగారం తర్వాత శారీరక శుభ్రత, ఆరోగ్యం చాలా ముఖ్యం. అందువల్ల శృంగారం తర్వాత కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

Also Readఏరా బుద్దుందా..  అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!

వెంటనే మూత్ర విసర్జన చేయాలి

శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTIs) రాకుండా కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. జననాంగాల (ప్రైవేట్ పార్ట్స్) ద్వారా ప్రవేశించే బ్యాక్టీరియా మూత్ర విసర్జన ద్వారా బయటకు పోతుంది. వెంటనే మూత్ర విసర్జన చేయకపోతే బ్యాక్టీరియా మూత్రాశయంలోకి వెళ్లి ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంటుంది. 

Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

ప్రైవేట్ పార్ట్స్ శుభ్రం చేసుకోవాలి

శృంగారం తర్వాత జననాంగాలను (ప్రైవేట్ పార్ట్స్) గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. సబ్బులు లేదా కెమికల్స్ కలిపిన లోషన్లను వాడకూడదు. దీని వల్ల చికాకు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కేవలం నీటిని వాడటం మంచిది. ఇది బ్యాక్టీరియా వృద్ధిని కంట్రోల్ చేస్తుంది.

టైట్‌గా ఉండే లోదుస్తులు ధరించకూడదు

శృంగారం తర్వాత వెంటనే బిగుతుగా ఉండే లోదుస్తులు (ముఖ్యంగా సింథటిక్ దుస్తులు) ధరించ కూడదు. దీని వల్ల గాలి తగిలే అవకాశం తగ్గి, తేమ పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంటుంది. అందువల్ల శృంగారం తర్వాత కాటన్ లోదుస్తులు ధరించడం లేదా కొంతసేపు లోదుస్తులు లేకుండా ఉండటం మంచిది. 

గర్భనిరోధక సాధనాలు వాడటం

కండోమ్ లేదా ఇతర గర్భనిరోధక సాధనాలను ఉపయోగించినట్లయితే.. వాటిని సరైన పద్ధతిలో తొలగించి పడేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అవాంఛిత గర్భం లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

వెంటనే నిద్రపోకూడదు

శృంగారం తర్వాత వెంటనే నిద్రపోవడం వల్ల పైన చెప్పిన పరిశుభ్రత చర్యలను విస్మరించే అవకాశం ఉంది. కనీసం ఐదు నుంచి పది నిమిషాలు విశ్రాంతి తీసుకుని, పై చిట్కాలను పాటించిన తర్వాతే నిద్రపోవడం మంచిది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా శృంగారం తర్వాత ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండవచ్చు. ఏవైనా అసాధారణ లక్షణాలు లేదా అసౌకర్యం అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

Advertisment
Advertisment
తాజా కథనాలు